బాహుబలి సిరీస్ గురించి తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.మరి ఈ సిరీస్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా ఫుల్ బిజీగా ఉన్నాడు.వరుసగా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషీ ఇస్తున్నాడు.
వరుస షూటింగులతో ఏ మాత్రం విశ్రాంతి లేకుండా గడుపుతున్న డార్లింగ్ త్వరలోనే కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.ఈయన ఎంత బిజీగా ఉన్న తాజాగా తన అభిమానులతో కలిసి ప్రత్యేకంగా ఫోటోలు దిగారు.
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఫొటోల్లో డార్లింగ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రభాస్ స్టైలిష్ లుక్ లో అదిరిపోయాడు.సూపర్ స్టైలిష్ లుక్ లో ఉన్న ప్రభాస్ పిక్ ను ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు.ఇదిలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘సలార్’ ఒకటి.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.
సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది.

దీంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చేస్తున్నాడు.ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కాబోతుంది.అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో మరో హారర్ సినిమా, ఇంకా సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు లైన్లో ఉన్నాయి.
ఇన్ని ఉండగా బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ సిద్ధార్థ్ తో కూడా మరో భారీ సినిమా చేయబోతున్న గట్టిగానే వార్తలు వస్తున్నాయి.