యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) అభిమానులు అమెజాన్ ప్రైమ్ పై సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేస్తున్నారు.ఒక స్టార్ హీరో సినిమా ను స్ట్రీమింగ్ చేసే ముందు మినిమం ప్రమోషన్ చేయాలనే బుద్ది లేదా అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి అమెజాన్ ప్రైమ్ కి ఎందుకు సినిమాను ఇచ్చారు అంటూ ఆదిపురుష్ సినిమా మేకర్స్ పై కూడా ప్రభాస్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ అభిమానులతో పాటు దేశం మొత్తం కూడా ఆదిపురుష్ సినిమా స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో సైలెంట్ గా ఆదిపురుష్( Adipurush ) ను ఎందుకు స్ట్రీమింగ్ చేయాల్సి వచ్చింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.గత కొన్ని వారాలుగా ఈ సినిమా కోసం మేము వెయిట్ చేస్తున్నాం.సినిమా 50 రోజులు పూర్తి అయిన తర్వాత స్ట్రీమింగ్ చేయాలి అనేది మంచి నిర్ణయమే.కానీ ఇలా సైలెంట్ గా రావాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేసే విధంగా అమెజాన్( Amazon prime ) ముందస్తుగా ప్రచారం చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఆదిపురుష్ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యం లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ స్ట్రీమింగ్ అభిమానులు హడావుడి చేస్తున్నారు.అత్యధికంగా స్ట్రీమింగ్ అయిన సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియా సర్కిల్స్ లో భారీగా ప్రచారం జరుగుతోంది.థియేట్రికల్ రన్ లో నిరాశ పరిచినా కూడా ఓటీటీ లో రాబోయే ఏడాది పాటు ఈ సినిమా సందడి చేయడం ఖాయం అంటూ ప్రభాస్ అభిమానులు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.
ఇక ప్రభాస్ వచ్చే నెలలో సలార్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.వచ్చే ఏడాది లో ప్రాజెక్ట్ కే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.