ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడుతున్నాయి.మే 13న పోలింగ్ కావడంతో.
ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈసారి ఎన్నికలలో 2014 మాదిరిగా బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీలు( BJP TDP Janasena ) కూటమిగా ఏర్పడటం తెలిసిందే.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు చంద్రబాబు కలిసి ఎన్నికల ప్రచారంకి శ్రీకారం చుట్టారు.ఆల్రెడీ గత కొద్ది రోజుల నుండి ఎవరికి వారు… ప్రచారం నిర్వహించడం జరిగింది.
బుధవారం తణుకులో అదేవిధంగా తర్వాత నిడదవోలులో ఇద్దరు కలిసి పాల్గొన్నారు.నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం( YCP Government )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రౌడీ రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలని పేర్కొన్నారు.
గోదావరి జలాలను ఈ ప్రాంతానికి అందిస్తాం.యువత కోసం ఇండోర్ స్టేడియం నిర్మిస్తాం.అర్హులైన ప్రతి ఒక్కరికి టీడ్కో ఇల్లు నిర్మిస్తాం.
ఎదిరించే వాడే లేకపోతే… బెదిరించే వాడిదే రాజ్యం.ఐదుగురి చేతిలో రాష్ట్రం నలిగిపోతుంది.
వైసీపీ పాలనలో జగన్( Jagan ) చెల్లెలికే న్యాయం జరగటం లేదు అని పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్లు గుంతల పాలయ్యాయి.
జగన్ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.
గుంతలు పూడ్చి.మూడు నెలలలో కొత్త రోడ్లు వేస్తామని పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చారు.