Pawan Kalyan Balakrishna : బాలయ్య వ్యాఖ్యలను తప్పుపట్టిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడా పరిస్థితి లేదంటూ?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ) అయి నెల రోజులు పూర్తి కావస్తున్నా కూడా ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ విషయంపై చాలామంది స్పందించకపోవడం పై అనేక రకాల వార్తలు కథనాలు వినిపించిన విషయం తెలిసిందే.కేవలం అశ్వనీ మురళీమోహన్ లాంటి వాళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించారు తప్ప మిగతా సెలబ్రిటీలు ఎవరూ కూడా ఈ విషయంపై కనీసం నోరు మెదపడం లేదు.

 Pawan Counters To Balakrishna Comments On Tollywood-TeluguStop.com

దీంతో కొంతమంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో చేతకాని వాళ్లు దద్దమ్మలు అంటూ వార్తలు సృష్టించినా కూడా రోషం తెచ్చుకుని అయినా స్పందిస్తారు అనుకున్నప్పటికీ అయినా కూడా ఎవరు స్పందించలేదు.

Telugu Balakrishna, Chandrababu, Ntr, Pawan Counter, Pawan Kalyan, Senior Ntr, T

అయితే వ్యవహారం పై తాజాగా బాలయ్య బాబు( Balakrishna ) తనదైన రీతిలో స్పందించాడు.ఈ సందర్భంగా బాలయ్య బాబు మాట్లాడుతూ.ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను.

ఇది సినిమా రంగానికి సంబంధించినది కాదని అనడం తప్పే.వాళ్లు కూడా పౌరులే కదా.వాళ్ల సినిమాల్ని జనం చూడాల్సిందే.వాళ్లను నా సెక్షన్ నుంచి తీసేశాను అంటూ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయంపై అలాగే బాలయ్య బాబు మాటలపై స్పందించారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ). బాలయ్య వ్యాఖ్యల్ని పరోక్షంగా తప్పుపడుతూ, ఇండస్ట్రీని వెనకేసుకొచ్చారు.సినిమా ఇండస్ట్రీపై పూర్తిగా ఒత్తిడి ఉంది.

Telugu Balakrishna, Chandrababu, Ntr, Pawan Counter, Pawan Kalyan, Senior Ntr, T

ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడానికి కూడా వాళ్లు చాలా భయపడుతున్నారు.అలాగే గతంలో ఎన్టీఆర్ సీఎం( Senior NTR )గా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మండలాధీశుడు లాంటి సినిమాలు వచ్చాయి.అప్పుడు కోట శ్రీనివాసరావు లాంటి వాళ్లు ఆ పాత్రలు పోషించారు.

కానీ ఇప్పుడా పరిస్థితి లేదని, ఏం మాట్లాడాలన్నా భయపడుతున్నారని వివరణ ఇచ్చారు పవన్.అదే విధంగా ఇక మీదట చంద్రబాబు అరెస్ట్ పై స్పందించమని సినీ ఇండస్ట్రీలో ఎవ్వర్నీ అడగొద్దని పరోక్షంగా మీడియాకు సూచించారు పవన్ కల్యాణ్.

ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే, పనిలోపనిగా జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ను కూడా వెనకేసుకొచ్చినట్టయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube