నమస్కారం పెట్టలేదని ఆ హీరో సినిమా నుంచి తీసేశారు.. ఎడిటర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ టాలీవుడ్ ఎడిటర్లలో ఒకరైన మార్తాండ్ కే వెంకటేశ్( Marthand k venkatesh ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.ప్రీ ప్రొడక్షన్ లో నేను జోక్యం చేసుకోనని ఆయన తెలిపారు.

 Marthand K Venkatesh Comments About Worst Experience Details Here Goes Viral In-TeluguStop.com

ప్రీ ప్రొడక్షన్ లో నిర్మాత, దర్శకునికి కథ నచ్చిన తర్వాత నేను కథ బాలేదని చెబితే సినిమా ఆగుతుందని అందువల్ల ఆ సమయంలో ఎవరూ ఓపెన్ ఒపీనియన్ చెప్పరని సినిమా మొదలైన తర్వాత అనుగుణంగా మార్పులు చేస్తారని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Pre, Sekhar Kammula, Tollywood-Movie

కథ వినకుండా ఎడిట్ చేస్తే ఫీలింగ్ బాగుంటుందని మార్తాండ్ కె వెంకటేశ్ అన్నారు.శేఖర్ కమ్ముల సినిమా( Sekhar Kammula ) 20 నిమిషాలు చెప్పారని అయితే ఆయన చెప్పిన దానితో పోలిస్తే ఎన్నో రెట్లు బెటర్ గా సినిమా ఉందని మార్తాండ్ కె వెంకటేశ్ చెప్పుకొచ్చారు.ఎడిట్ రూమ్ లో ఎంత గొడవ జరిగితే అంత మంచి సినిమా అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.

ఒక హీరో సినిమాను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చిందని మార్తాండ్ కే వెంకటేశ్ తెలిపారు.

Telugu Pre, Sekhar Kammula, Tollywood-Movie

ఒక హీరోకు సంబంధించి వరుసగా రెండు మూడు సినిమాలకు నేను పని చేశానని ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధించాయని ఆయన చెప్పుకొచ్చారు.ఆ హీరో చిన్న హీరో అని హిట్ల వల్ల మార్కెట్ పెరిగిందని మార్తాండ్ కె వెంకటేశ్ అన్నారు.ఆ చిన్నహీరో తనను పలకరించలేదని విష్ చేయలేదని తన సినిమాకు ఎడిటర్ గా వద్దన్నారని నేను కూడా ఓకే చెప్పి వెళ్లిపోయానని మార్తాండ్ కె వెంకటేశ్ తెలిపారు.

ఆ సినిమాకు సంబంధించి 45 నిమిషాల పాటు గొడవ జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.మేము హీరోలను విష్ చేసి వాళ్లు రియాక్షన్ ఇవ్వకపోతే హర్ట్ అవుతామని మార్తాండ్ కె వెంకటెశ్ వెల్లడించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను 1999 నుంచి ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.మార్తాండ్ కె వెంకటేశ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా( Social media )లో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube