మౌలిక వసతులు దేశాభివృద్ధి వంటి అంశాలను పక్కన బెట్టి సుదీర్ఘ కాలం నుండి భారత్ పై విషాన్ని అక్కడి ప్రజలలో గుప్పిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఫెయిల్డ్ నేషన్ గా మిగిలిపోయింది.అయినా బుద్ధి మార్చుకోని పాకిస్తాన్ ఇప్పటికీ భారత్ పై పడి ఏడుస్తుంది.
ఇక తాజా అంతర్జాతీయ సంబంధాల విషయంలో తమకు బ్రదర్ నేషన్స్ వంటి అరబ్ దేశాలను భారత్ మీద పగతో పాకిస్తాన్ వాటిని దాదాపు దూరం చేసేసుకుంది.ఈ మూవ్ ను చూసిన నెటిజన్స్ అంతా పక్క వాడి మీద కడుపు మంటతో మనం ఎలా నాశనం అవుతాము తెలుసుకోవడానికి పాకిస్తాన్ ని చూస్తే చాలని చురకలు అంటిస్తున్నారు.
ఇక బాధ్యత అంటే అర్థం తెలియని పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక వ్యక్తి తీవ్ర నష్టాన్ని కలిగించాడు.ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ రిటైర్డ్ మేజర్ జనరల్ సయ్యద్ ముస్తఫా అన్వర్ అనే పెద్ద మనిషి పాకిస్తాన్ విదేశాంగ శాఖ అనుమతి లేకుండా ఇండోనేషియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయ భవనాన్ని అమ్మేశాడు.దీనివల్ల పాకిస్తాన్ సుమారు 1.32 మిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూడవలసి వచ్చింది.ఇట్టి ఘన కార్యం నిర్వహించిన అధికారిని పాకిస్తాన్ అవినీతి నిరోధక సంస్థ(NAB) బుధవారం సయ్యద్ ముస్తఫా అన్వర్‌పై కోర్టులో రిఫరెన్స్ దాఖలు చేసి, అతన్ని దోషిగా తేల్చింది.
ఎప్పుడూ పక్క దేశాలపై పడి ఏడ్చే పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన అధికారి వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.