బిజినెస్ మ్యాన్‌గా మారుతున్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తోండగా మరో హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుకున్నాయి.

 Ntr Role In Trivikram Movie, Ntr, Rrr, Rajamouli, Trivikram, Ntr30-TeluguStop.com

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రారంభించిన చిత్ర యూనిట్ త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ అదిరిపోయే కథను రెడీ చేశాడట.

అటు ఈ సినిమాలో తారక్ ఓ బిజినెస్‌మెన్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.అల్ట్రా స్టైలిష్ లుక్‌లో తారక్ ఈ సినిమాలో మనకు కనిపిస్తాడట.

మొత్తానికి ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.అటు ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో తారక్ కొత్త అవతారం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.మరి ఈ సినిమాతో తారక్-త్రివిక్రమ్ కాంబో మరో బ్లాక్‌బస్టర్‌ను అందుకుంటుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube