2006లో ఫోటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అంజలి.నటించిన తొలి సినిమానే ఫ్లాప్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్, శాండిల్ వుడ్ ఇండస్ట్రీలపై దృష్టి పెట్టి అక్కడ విజయాలను అందుకుంది.
తెలుగమ్మాయే అయినప్పటికీ అంజలి తెలుగు హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయింది.అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నిశ్శబ్దం సినిమాలో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవితంలోని కీలక విషయాలను వెల్లడించింది.
చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలని కలలు కన్నానని.ఆ కలలను నిజం చేసుకున్నానని అంజలి అన్నారు.తొమ్మిది, పదో తరగతిలోనే ప్రేమ లేఖలు అందాయని ఒకబ్బాయి లవ్ లెటర్ ఇస్తే తాను రాఖీ కట్టానంటూ బాల్యంలోని మధుర జ్ఞాపకాలను అంజలి పంచుకున్నారు.ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను పాజిటివ్ గా తీసుకుని పరిష్కరించుకుంటానని.
అంతా మన మంచికే జరుగుతుందని భావిస్తానని చెప్పారు.
మనలా మనం నటిస్తే మాత్రమే ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలమని.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని సీత పాత్ర చూసి మొదట కంగారు పడినా ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని నటించానని అన్నారు.షూటింగుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళుతూ ఉంటానని అయితే హైదరాబాద్ రోడ్లపై తిరిగితే వచ్చే ఆనందం ఎక్కడా దొరకదని చెప్పుకొచ్చారు.
శోభన, కాజోల్ తనకు ఇష్టమైన హీరోయిన్లు అని అన్నారు.
చాలామంది డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించినా మణిరత్నం సినిమాలో నటించాలనే కోరిక మాత్రం మిగిలిపోయిందని అన్నారు.తొలి సినిమా ఫోటోలో తనతో కలిసి నటించిన భాను అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమెతోనే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు.సంగీత దర్శకులలో రెహమాన్ మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టమని అన్నారు.
చిక్కీలు, రెడ్ థాయ్ కర్రీ ఎక్కువగా తింటానని.అవే తనకు ఇష్టమైన ఆహారమని పేర్కొన్నారు.