ఎంతో మంది ఆడపిల్లల తల్లి తండ్రులు విదేశాల్లో ఉద్యోగం చేసుకునే అబ్బాయిలకి తమ పిల్లలని ఇస్తే వారి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన పడవలసిన అవసరం లేదని భావిస్తూ ఉంటారు.అయితే చాలా కేసుల్లో భారత్ నుంచీ విదేశాలకి పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్తున్న ఆడపిల్లలకి భద్రత లేకుండా పోతోంది.
అక్కడ తమ పిల్లలని భర్త ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇక్కడ ఉన్న తల్లి తండ్రులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.
దాంతో కొంతమంది ఎన్నారైల ఆగడాలకి హద్దు లేకుండా పోతోంది దంతి ఈ అక్రమాల్ని అరికట్టాలని కేంద్రం ఎప్పటినుంచీ ఓ బిల్లుకి రూపకల్పన చేస్తూ వచ్చింది.తాజాగా ఈ బిల్లుని రాజ్యసభలో ప్రవేసపెట్టింది.ఇకపై అలాంటి ఎన్నారైల ఆగడాలకి బ్రేకులు పడటం ఖాయమని తేల్చి చెప్పింది.అందులో భాగంగానే భారతదేశంలో వివాహాలు చేసుకున్న ఎన్నారై లు పెళ్ళైన ముప్పై రోజుల్లోగా వివాహం జరిగినట్టు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది
ఒక వేళ అలా చేయని పక్షంలో వారి పాస్‌పోర్టును అధికారులు క్యాన్సిల్ చేస్తారని తెలిపింది.“రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ నాన్-రెసిడెంట్ ఇండియన్ బిల్- 2019” ను రూపొందించారు.అయితే పెళ్లి చేసుకున్నట్టుగా రిజిష్టర్డ్ చేసుకొని ఎన్నారైల ఆస్తుఅల ని జప్తు చేసేలా ఈ బిల్లు రూపొందించింది.