సీనియర్ నటుడు నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెల్సిందే.నరేష్ కు ఇది నాల్గవ పెళ్లి.
ఆయన మూడవ భార్య రమ్య రఘుపతి తో విడాకులు తీసుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నాడు.విడాకులు దాదాపుగా మంజూరు అయినట్లుగా తెలుస్తోంది.
అయితే ఆమెకు ఉన్న బాబు విషయంలో విడాకుల కేసు పెండింగ్ లో ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది.నరేష్ మరియు రమ్య ల యొక్క తనయుడు ఎవరి వద్ద ఉండాలి అనేది ప్రశ్నగా ఉంది.
రమ్య ఆ మధ్య ఇంటర్వ్యూలో మరియు కోర్టు లో కూడా తమ కొడుకు ఇద్దరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు.తండ్రి ప్రేమ వాడికి కావాలి.తండ్రి యొక్క ఆలనా పాలన వాడికి దక్కాలి.అందుకే నేను నరేష్ తో కలిసి ఉండాలని మొదటి నుండి కూడా కోరుకుంటున్నాను అంటూ రమ్య పేర్కొంది.నరేష్ మాత్రం ఆమె తో కలిసి ఉండేది లేదు అంటున్నాడు.
అదే సమయంలో తన కొడుకును తనకు అప్పగిస్తే చూసుకుంటాను అన్నట్లుగా కోర్టు లో విజ్ఞప్తి చేశాడట.
అతి త్వరలోనే తుది తీర్పు వస్తుందని నరేష్ భావిస్తున్నాడు.ఇప్పటికే తాము ఇద్దరం ప్రేమలో ఉన్నాం.
పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.ఒక వీడియోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది.
నరేష్ మరియు పవిత్రల యొక్క ముద్దు వీడియో ఆ మధ్య వైరల్ అయ్యింది.
పెళ్లి కోసం రెడీ అవుతున్న వీరు ఇద్దరు కోర్టు తుది తీర్పు కోసం వెయిట్ చేస్తున్నట్లుగా వారి సన్నిహితులు చెబుతున్నారు.కలిసి ఇప్పటికే జీవితాన్ని సాగిస్తున్న వీరిద్దరు అధికారికంగా ఒక్కటి అవ్వాల్సి ఉంది.పవిత్ర లోకేష్ కు కూడా గతంలో పెళ్లిలు అయ్యాయి.
ఇద్దరు కూడా ఒక సినిమా షూట్ లో పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే విషయం తెల్సిందే.