బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా మొదటి రోజే వంద కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.సినిమాలో దీపికా పదుకునే ధరించిన కాషాయ రంగు బికినీ వివాదం కారణంగా సినిమాకు విడుదలకు ముందు భారీ పబ్లిసిటీ దక్కింది.
దాంతో పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ లభించాయి అనడంలో సందేహం లేదు.సినిమా విడుదలకు ముందే దాదాపుగా అయిదు లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అమ్ముడు పోయాయి.
అలాంటిది ఏ స్థాయిలో సినిమా వసూళ్లు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ను నమోదు చేసిన ఈ సినిమా ప్రాంతీయ భాషల్లో మాత్రం నిరాశే మిగిల్చింది.
తెలుగు లో ఈ సినిమా యొక్క ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేసిన విషయం తెల్సిందే.దాంతో తెలుగు వర్షన్ పఠాన్ కి మంచి బజ్ క్రియేట్ అయ్యి భారీ వసూళ్లు నమోదు అవుతాయి అని అంతా భావించారు.
కానీ పఠాన్ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సంక్రాంతికి విడుదల అయిన వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమా లు ఇంకా కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తున్నా కూడా పఠాన్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం లేదు.తెలుగు రాష్ట్రాల్లో పఠాన్ కు మినిమంగా వస్తాయని ఆశించిన కలెక్షన్స్ లో కనీసం సగం కూడా రాలేదు అనేది కొందరి మాట.అయితే ప్రపంచ వ్యాప్తంగా సినిమా భారీ వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న కలెక్షన్స్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.

మన సౌత్ సినిమా లు నార్త్ లో భారీ గా వసూళ్లు రాబడుతున్నాయి కానీ నార్త్ సినిమాలు మాత్రం సౌత్ లో పెద్దగా సత్తా చాటలేక పోతున్నాయి.ఆ మధ్య వచ్చిన బ్రహ్మాస్త్ర అంతకు ముందు వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమాల పరిస్థితి అదే అనే విషయం తెల్సిందే.పఠాన్ సినిమా యొక్క తెలుగు ఫలితం భవిష్యత్తులో వచ్చే హిందీ సినిమాలకు ఒక పాఠం అయ్యే అవకాశం ఉంది.