నాని( Nani ) సాయిపల్లవి( Saipallavi ) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎంసీఏ, శ్యామ్ సింగరాయ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.
నాని శేఖర్ కమ్ముల కాంబినేషన్ ఫ్యాన్స్ కు కూడా కొత్తగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
శేఖర్ కమ్ముల ఇకపై వేగంగా సినిమాలను తెరకెక్కించాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం అందుతోంది.శేఖర్ కమ్ముల సినిమాలన్నీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
నాని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాలకు ఓకే చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి.నాని కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ విభిన్నమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం హిట్ 3( Hit 3 ) సినిమాతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలు పూర్తైన తర్వాత నాని శేఖర్ కమ్ముల కాంబోలో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది.నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 35 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.న్యాచురల్ స్టార్ నాని సినిమా సినిమాకు లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.నాని తాజాగా సరిపోదా శనివారం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
సరిపోదా శనివారం మూవీ కలెక్షన్ల పరంగా కూడా అదరగొట్టింది.నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.