బిగ్బాస్ తెలుగు సీజన్ 8( Bigg Boss 8 ) ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈసారి చాలామంది కొత్త ముఖాలే కనబడుతున్నా వారు వారానికి ఎక్కువ డబ్బులే పొందుతూ అందరినీ ఆశ్చర్యపడుతున్నారు.
మరి ఎవరెవరు ఎంత డబ్బులు అందుకుంటున్నారో తెలుసుకుందాం.
సీరియల్ యాక్ట్రెస్ యష్మీ గౌడ( Yashmi Gowda ) ఫాంటసీ టీవీ సిరీస్ నాగ భైరవి, డ్రామా సిరీస్ కృష్ణ ముకుంద మురారిలో నటించి ఫేమస్ అయ్యింది.ఈమెకు ఇన్‌స్టాలో 1.45 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.ఈమె రెండు లక్షలన్నర రూపాయల రెమ్యునరేషన్ పొందుతుంది.
బుల్లితెర నటుడు నిఖిల్( Nikhil ) మలియక్కల్, గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మలో సీరియళ్లతో ఫేమస్ అయ్యాడు.ఈ యాక్టర్‌కు 1.47 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వీక్లీ రూ.2.5 లాక్స్.
యాక్టర్, డైరెక్టర్ అభయ్ బేతిగంటికి( Abhay Bethiganti ) ఇన్‌స్టాలో 22 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.పెళ్లి చూపులు (2016) చిత్రంలో విష్ణు పాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి రెండు లక్షలు.
బుల్లితెర నటి ప్రేరణ కంబం( Prerana Kambam ) కృష్ణ ముకుంద మురారి సీరియల్‌తో పాపులరైంది.ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో 1,65,000 మంది ఫాలోవర్లు ఉన్నారు.బిగ్‌బాస్ వీక్లీ 2 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తారు.
ఇంటర్నెట్ సెలబ్రిటీ మధు నెక్కంటి “బెజవాడ బేబక్క”గా ఫేమస్ అయింది.ఆమె తన షార్ట్ కామెడీ వీడియోలతో గుర్తింపు తెచ్చుకుంది.ఈ ఇంటర్నెట్ స్టార్‌కి ఇన్‌స్టాలో రెండు లక్షల ఫాలోవర్లు ఉన్నారు.ఈమెకు బిగ్‌బాస్ వీక్లీ రెమ్యునరేషన్ రూ.1,50,000 అందిస్తున్నారు.దాదాపు అంతే సంఖ్యలో ఆమెకు ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు.
శేఖర్ బాషా( Sekhar Basha ) ఓ రేడియో జాకీ.అతను 92.7 బిగ్ ఎఫ్ఎమ్‌లో రేడియో జాకీగా కూడా పని చేశాడు.ఇన్‌స్టాలో 60 వేల ఫ్యాన్ ఫాల్లోవర్లు ఉన్నారు.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి 2.5 లక్షలు.
నటుడు, దర్శకుడు ఆదిత్య ఓం( Aditya Om ) లాహిరి లాహిరి లాహిరిలో (2002), ప్రేమించుకున్నాం పెళ్లికి రండి (2004) చిత్రాలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.ఈయనకు ఇన్‌స్టాలో 17.4 లక్షల ఫాల్లోవర్లు ఉన్నారు.బిగ్‌బాస్ వారానికి రూ.3 లక్షలు ఇస్తారు.
సోనియా అకుల( Sonia Akula ) జార్జ్ రెడ్డి (2019) సినిమాలో ఓ చిన్న వేషం వేసింది.2022 డాక్యుడ్రామా ఆషా ఎన్‌కౌంటర్‌లో ఆషా పాత్ర పోషించి బాగా పేరు తెచ్చుకుంది.ఇన్‌స్టాలో 1.8 లక్షల ఫాల్లోవర్లు ఉన్నారు.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి 1,50,000 చెల్లిస్తున్నారు.
నటి కిర్రాక్ సీత బేబీ (2023) చిత్రంలో సీత పాత్ర వేసి ఆకట్టుకుంది.ఇన్‌స్టాలో 1.1 లక్షల ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి 2 లక్షలు పే చేస్తారు.
నాగ మణికంఠ టీవీ సీరియల్ కస్తూరిలో నటించాడు.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి రూ.1 లక్ష 20 వేలు పే చేస్తున్నారు.
పృథ్వీరాజ్ శెట్టి ఫాంటసీ టీవీ సీరియల్ నాగపంచమిలో నటించి ఫేమస్ అయ్యాడు.ఇన్‌స్టాలో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఈయన బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి రూ.1.5 లక్షలు.
విష్ణుప్రియ( Vishnu Priya ) పోవే పోరా గేమ్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించి పాపులర్ అయ్యింది.
వాంటెడ్ పండుగోడ్ (2022), క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ దయాలో కూడా ఆమె కనిపించింది.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి రూ.4 లక్షలు పే చేస్తారు.ఆమెకు 12 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు.
కొరియోగ్రాఫర్ నైనికా అనసురు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, ఢీ రియాలిటీ డ్యాన్స్ కాంపిటీషన్ షోలలో ఆమె పాటిస్పేట్ చేసింది.ఆమెకు 9 లక్షల 15 వేల మంది ఇన్‌స్టా ఫాలోవర్లో ఉన్నారు.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి రూ.2.2 లక్షలు పే చేస్తారు.
ఇంటర్నెట్ సెలబ్రిటీ నబీల్ అఫ్రిదికి ఇన్‌స్టాలో 4.55 లక్షల ఫాలోవర్లు ఉన్నారు.ఇతను “వరంగల్ డైరీస్” యూట్యూబ్ ఛానెల్‌ని స్థాపించాడు.
కామెడీ, పేరడీ వీడియోలు చేస్తుంటాడు.బిగ్‌బాస్ రెమ్యునరేషన్ వారానికి రూ.2 లక్షలు శాలరీ ఇస్తారు.