ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన పనికి ఏడ్చేసిన హీరోయిన్ రమ్యకృష్ణ..?

శుభ లగ్నం, మావిచిగురు, వినోదం, పెళ్లాం ఊరెళితే వంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు దర్శకుడు ఎస్‌.వి.

 Ramyakrishna Crieds Because Of Sv Krishna Reddy Details, Director Sv Krishna Red-TeluguStop.com

కృష్ణారెడ్డి.( SV Krishna Reddy ) ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ తీసిన ఫస్ట్ మూవీ “కొబ్బరిబొండాం”.

లేటెస్ట్ మూవీ “ఆర్గానిమ్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు”.ఇవన్నీ కూడా ఎలాంటి అశ్లీల, అసభ్యకరమైన సన్నివేశాలు డైలాగులు లేకుండా రూపొందాయి.

కృష్ణారెడ్డి సినిమా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హాయిగా చూడొచ్చు అని ఒక నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.విలువలకు ఎక్కువగా గౌరవం ఇచ్చే కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు.

ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో చేశాడు.

కృష్ణారెడ్డి కథలు బాగా రాస్తాడు.

సినిమాలకు తానే అద్భుతమైన సంగీతం కంపోజ్ చేస్తాడు.పాటల్లో కూడా బూతు మాటలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండేవి కావు.

ఆయన సినిమాల్లోని పాటలు కూడా అశ్లీల పదాలు లేకుండా అందరూ వినేలాగా ఉంటాయి.

Telugu Aahwanam, Ramya Krishna, Ramyakrishna, Srikanth, Tollywood-Movie

కృష్ణారెడ్డి తన సినిమాల్లోని హీరోయిన్ల పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు.నటీమణులకు ఇచ్చిన ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కారణంగానే సినిమాలు హిట్ అయ్యేవి.కృష్ణారెడ్డి వాళ్ళ లాంటి వాళ్లు నటీమణులను గౌరవించి మంచి క్యారెక్టర్లు ఇస్తుంటే మరి కొంతమంది మాత్రం వారిని వస్తువు లాగా చూసేవారు.

ఇప్పటికీ చూస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌( Casting Couch ) చాలా ఏళ్లుగా ఉంది.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి దర్శకులు తమను వేధించినట్లు చాలామంది నటీమణులు షాకింగ్ అలిగేషన్స్ చేశారు.ఈ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎస్‌.

వి.కృష్ణారెడ్డి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Telugu Aahwanam, Ramya Krishna, Ramyakrishna, Srikanth, Tollywood-Movie

సినీ ఇండస్ట్రీలో కొందరు అమ్మాయిలను లైంగికంగా వేధిస్తారనే మాట చాలా కాలంగా వింటున్నానే ఉంటాం.కానీ వాటి గురించి నాకు అసలు తెలియదు.ఆ విషయాల గురించి నేను పెద్దగా ఆలోచించను.నేను మొదటి నుంచీ మహిళలను గౌరవంగా చూస్తాను.వారిని గౌరవంగా చూసుకోవడమే నాకు తెలుసు.ఎంటైర్ కెరీర్‌లో ఇప్పటిదాక ఏ యాక్ట్రెస్‌తోనూ హద్దులు మీరి ప్రవర్తించింది లేదు.

నా సినిమాల్లో మహిళలను చాలా గౌరవంగా చూపిస్తాను కదా.నిజజీవితంలోనూ వారిని అలాగే గౌరవిస్తా.” అని కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

“శ్రీకాంత్‌, రమ్యకృష్ణ హీరోహీరోయిన్లుగా నేను ‘ఆహ్వానం’ మూవీ( Aahwanam Movie ) చేశాను.అది పెద్ద విజయం సాధించింది.ఆ సినిమా షూటింగ్‌ ముగిసిన తర్వాత రమ్యకృష్ణ( Ramya Krishna ) వెళ్లిపోతున్నప్పుడు.వెండి పళ్లెంలో పట్టుబట్టలు, రూ.10 వేలు పెట్టి, ఆమెకు బొట్టు పెట్టి సాగనంపాం.ఆ సమయంలో చాలా భావోద్వేగానికి గురైంది.అవన్నీ చూడగానే ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది.ఆమెను అలా చూసి యూనిట్‌లోని మేమంతా కూడా ఎమోషనల్‌ అయ్యాము.ఈ సంఘటన నా లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

’ అన్నారు ఎస్‌.వి.కృష్ణారెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube