మరే తెలుగు హీరో అయినా 'బిగ్‌బాస్‌' చేసేవారు కాదేమో

తెలుగు బిగ్‌ బాస్‌ 4 ప్రారంభంకు అంతా సిద్దం అయ్యింది.ఈనెల 6వ తారీకు నుండి షో ప్రారంభం కాబోతుంది.

 Nagarjuna Star Maa Big Boss 4-TeluguStop.com

ఆ రోజు ఉదయం కంటెస్టెంట్స్‌ ఎంట్రీ కి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుంది.అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు షో ను స్టార్‌ మాలో ప్రసారం చేయబోతున్నారు.

కరోనా కారణంగా ఈసారి ఉంటుందా ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.చివరకు షో ప్రారంభంకు అంతా రెడీ అయ్యింది.

షూటింగ్‌ కు నాగార్జున సిద్దం అయ్యాడు.కరోన మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో మరే స్టార్‌ అయినా కూడా ఖచ్చితంగా బిగ్‌ బాస్‌ కు నో చెప్పేవాడు.

నాగార్జున కనుక ఈ షో ప్రారంభం అవుతుందని అంటున్నారు.మొన్నటి వరకు తమిళ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూడా బిగ్‌ బాస్‌ కు నో చెబుతూ వచ్చాడు.

అయితే ఇప్పుడు ఆయన నాగార్జున మొదలు పెట్టడంతో సిద్దం అయ్యాడు.వచ్చే నెల రెండవ వారం నుండి తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయ్యింది.ఈ కరోనా సమయంలో ఎక్కడ కూడా బిగ్‌ బాస్‌ కొత్త సీజన్‌ లు ప్రారంభం కాలేదు.

తెలుగు బిగ్‌బాస్‌ 4 కు ఇదో అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు.ఈ ఏడాదిలో టెలికాస్ట్‌ కాబోతున్న మొదటి బిగ్‌ బాస్‌ నాగార్జునదే అవ్వడంతో ఆయన ధైర్యం గురించి చర్చించుకుంటున్నారు.

బిగ్‌ బాస్‌ నిర్వాహకులపై ఇదే సమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి.కరోనా సమయంలో కంటెస్టెంట్స్‌ లో ఎవరికి అయినా వైరస్‌ అటాక్‌ అయితే పరిస్థతి ఏంటీ అంటూ విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube