ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎంతో మంది తెలుగువారు వివిధ వృత్తులలో స్థిరపడ్డారు.అనేక రంగాలలో మనదైన ప్రతిభతో దూసుకువెళ్తున్నారు.
ఎంత ఎత్తుకి ఎదిగినా సరే మూలాలని మాత్రం విస్మరించడంలేదు.తెలుగువారందరికీ తెలుగు భాషపై ఉన్న ప్రేమ, అభిమానం వారిని ఇప్పటికీ ఎంతో మందిని తెలుగు భాషాభిమానులుగా కొనసాగేలా చేస్తోంది.
అంతేకాదు తెలుగు వెలుగు కోసం, తెలుగు భాషాబివృద్ది కోసం ఎంతో మంది తెలుగు వారు విదేశాలలో సంస్థలు కూడా ఏర్పాటు చేసుకున్నారు.ఈ క్రమంలోనే అమెరికాలో ఉండే తెలుగువారికోసం వంగూరి ఫౌండేషన్ స్థాపించబడింది.
తెలుగు సాహిత్యాభిమానులకు, తెలుగు పండితులకి, అమెరికాలో తెలుగువారు ఏర్పాటు చేసిన వంగూరి ఫౌండేషన్ శుభవార్త తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు వంగూరి ఓ వేదికని ఏర్పాటు చేసింది.
ఇందుకోసం ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది.ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 10,11 తేదీలలో ప్రపంచ 7వ తెలుగు సాహిత్య సదస్సును ప్రారంభించనున్నారు.
ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే.
వంగూరి ఏర్పాటు చేస్తున్న ఈ సాహిత్య సదస్సును సుమారు 24 గంటల పాటు నిర్విరామంగా కొనసాగించనున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలలో తెలుగు వారు ఎక్కడనుంచైనా పాల్గొనవచ్చని తెలిపారు.జూమ్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, పలు రకాల సోషల్ మీడియాల ద్వారా వీక్షించేందుకు లైవ్ టెలికాస్ట్ అందించనున్నారు.
ఏ సమయంలోనైనా ఈ సదస్సు లైవ్ లో పాల్గొనవచ్చునని ప్రకటించారు.ఈ సదస్సులో ప్రసంగించ దలిచిన వారు ఎవరైనా సరే తమ ప్రసంగం యోక్క వ్యాసం, వక్త పేరు, ఫోటో , పరిచయం, వాట్సప్ నెంబర్ లను సెప్టెంబర్ 10 లోగా తమకి పంపాలని సూచించారు.మరిన్ని వివరాలకోసం
వాట్సప్ నెంబర్ : + 1 832 594 9054