Nagababu : మా అన్నయ్యతో గొడవపడితే వదిన ప్రవర్తన ఇలా ఉంటుంది : నాగబాబు

సాధారణంగా అన్నదమ్ములు అన్నాక ఎదో ఒక చిన్న చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి.కానీ మెగా బ్రదర్స్ అయినా చిరంజీవికి తన తమ్ముళ్లైన నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో మంచి అనుబంధం ఉంటుంది.

 Nagababu About Surekha-TeluguStop.com

అలాగే చిరంజీవికి ఏదైనా కష్టం వస్తే ఆదుకునేందుకు ఎల్లప్పుడూ నాగబాబు, పవన్ కళ్యాణ్ ముందుంటారు.చిరంజీవి ( Chiranjeevi )కూడా తమ్ముల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

వారిని ఎప్పుడూ వెనకేసుకొస్తుంటారు.అయితే వీరి మధ్య ఇంత మంచి ప్రేమ ఉన్నా చిన్నపాటి అభిప్రాయ భేదాలు అప్పుడప్పుడు తలెత్తుతుంటాయి.

ముఖ్యంగా నాగబాబుకి, చిరంజీవికి మధ్య అభిప్రాయ బేధాలు ఎక్కువగా వస్తుంటాయి.ఆ సమయంలో తన వదిన సురేఖ కొణిదెల ఎలా ప్రవర్తిస్తుందో తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Telugu Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Ram Charan, Surekha, Tollywood-Movie

నాగబాబు( Nagababu ) మాట్లాడుతూ.“నాకు మా అన్నయ్యకి అప్పుడప్పుడు అభిప్రాయ బేధాలు వస్తాయి.ఏదైనా విషయంలో ఇది కరెక్ట్ అన్నయ్య, ఇది కరెక్ట్ కాదు అన్నయ్య అని నేను చెప్తుంటాను.కొన్నిసార్లు నా మాట వింటారు, మరికొన్నిసార్లు ఆయన మాట నేను వింటాను.

ఒక విషయంలో ఇద్దరి మధ్య బాగా తేడా వచ్చినప్పుడు మా వదిన మధ్యలో నిలబడుతుంది.గబుక్కున అన్నయ్య నన్ను ఏదైనా అన్నప్పుడు, వెంటనే మా వదిన నా తరఫున నిలబడుతుంది.‘పోన్లెండి, వదిలేయండి‘ అని అన్నయ్యకు సర్ది చెప్తుంది.‘పట్టించుకోకు, రా’ అని నాక్కూడా చెబుతుంది.” అని చెప్పుకొచ్చాడు.

Telugu Chiranjeevi, Nagababu, Pawan Kalyan, Ram Charan, Surekha, Tollywood-Movie

తన వదిన తనను బాగా చూసుకుంటుందని, చాలా నైస్ పర్సన్ అని వెల్లడించాడు.“మా వదినకి నేనంటే బాగా ఇష్టం ఎందుకంటే నేను బాగా నవ్విస్తుంటాను.అందుకే నాగబాబు ఉంటే బాగుంటుంది అని ఆమె కోరుకుంటుంది, నా జోకులు విని బాగా రిలాక్స్ అవుతుంది.” అని నాగబాబు పేర్కొన్నాడు.నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేవలం నాగబాబు విషయంలోనే కాదు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )కి అయితే మరొక తల్లిలా సురేఖ ఉంటారని వారిని దగ్గరగా చుసిన వారికి అందరికి తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube