ప్రధాని మోడీ నేడు వారణాసి లో పర్యటించనున్నారు.ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం కావటంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మరియు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.
సుమారు 1500 కోట్ల విలువైన పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ఈ పర్యటనలో చేయనున్నారు.ఇప్పటికే 744 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పూర్తి కావడంతో వాటిని ఈ పర్యటనలో మోడీ ప్రారంభించనున్నారు.

బెనారస్ వర్సిటీలో ఎం.సి.హెచ్ లో వంద పడకల దవాఖాన, అదే రీతిలో గంగా నదిలో పర్యాటక రోరో బోట్లు.వారణాసి- ఘాజీపూర్.
జాతీయ రహదారి పై నిర్మించిన బ్రిడ్జి, అదేవిధంగా జపాన్ సహకారంతో నిర్మించిన రుద్రాక్ష ని కూడా ఈ పర్యటనలో ప్రధాని ఓపెన్ చేయనున్నారు.త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
మోడీ పర్యటన నేపథ్యంలో యూపీలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు యోగి ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది.