Chandrababu : రేపు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ కాబోతున్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవత్తరంగా మారుతుంది.ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి వెళ్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.ఈ రకంగానే ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( MLA Vasantha Krishna Prasad ) వ్యవహారం ఉంది.2019 ఎన్నికలలో మైలవరం నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలుస్తూ వచ్చారు.తాజాగా మార్చి రెండవ తారీకు శనివారం హైదరాబాద్ లో చంద్రబాబు( Chandrababu ) నివాసంలో ఉదయం 9 గంటలకు టీడీపీలో జాయిన్ కాబోతున్నట్లు స్పష్టం చేశారు.

 Mla Vasantha Krishna Prasad Who Is Going To Join Tdp Tomorrow In The Presence O-TeluguStop.com

తనతోపాటు ఎప్పటినుండో తన వెంటే నడుస్తున్న కొంతమంది నాయకులు కూడా జాయిన్ అవుతున్నట్లు పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలలో చంద్రబాబు మరియు లోకేష్( Lokesh ) ఆదేశాల అనుసారంగా తన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.హైదరాబాదులో జాయిన్ అన్న అనంతరం నియోజకవర్గం లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు మీడియాతో స్పష్టం చేశారు.ఏది ఏమైనా 2024 ఎన్నికలలో చంద్రబాబు ఆదేశాలనుసారంగానే తన పోటీ ఉంటుందని.

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.ఏపీలో ఎన్నికలకు ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది.

దీంతో చాలామంది నేతలు ఒక పార్టీ నుండి మరొక పార్టీ లోకి జంప్ అవుతూ వస్తున్నారు.ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన తర్వాత… రాజీనామాలు ఇతర పార్టీలలోకి జాయినింగ్ లు ఎక్కువ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube