మెక్సికోలో( Mexico ) సరదా కోసం ఈత కొడదామని నీటిలోకి దిగిన ఒక తల్లి ప్రాణాలను సొరచేప( Shark ) తీసేసింది.తన కుమార్తెతో కలిసి ఈత కొడుతున్న ఈ తల్లి షార్క్ దాడిలో అత్యంత ఘోరంగా చనిపోయింది.
పసిఫిక్ తీరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన మెలాక్ బీచ్‌లో( Melaque Beach ) శనివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.మృతురాలిని ఫెర్నాండెజ్ మార్టినెజ్ జిమెనెజ్ (26)గా( Fernandez Martinez Jimenez ) గుర్తించారు, ఆమె సమీపంలోని పట్టణంలో నివసిస్తుంది.
ఒడ్డుకు 25 మీటర్ల దూరంలో తేలియాడే ప్లాట్‌ఫామ్‌పై ఆడుకుంటున్న తన ఐదేళ్ల కుమార్తెతో కలిసి బీచ్‌లో ఆమె ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఫెర్నాండెజ్ తన 5 ఏళ్ల కుమార్తెను ప్లాట్‌ఫామ్‌పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా, ఒక సొరచేప ఆమె కాలిని కొరికి నీటి అడుగుకు లాగింది.ఆమె షార్క్ దవడల నుంచి తనను తాను విడిపించుకోగలిగింది.ఇతర ఈతగాళ్లు ఒడ్డుకు వెంటనే చేర్చారు.
అయితే, ఆమె తుంటి దగ్గర పెద్ద గాయం అయ్యింది, చాలా రక్తాన్ని కోల్పోయింది.రెస్క్యూ సిబ్బంది( Rescue Team ) హుటాహుటిన వచ్చి ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించారు, కానీ చాలా ఆలస్యం అయింది.
ఫెర్నాండెజ్ సంఘటనా స్థలంలో మరణించినట్లు ప్రకటించారు.
ఆమె కుమార్తె క్షేమంగా ఉంది కానీ భయంకరమైన దాడి కారణంగా మానసికంగా డిప్రెషన్ కి లోనయ్యింది.అధికారులు ముందుజాగ్రత్త చర్యగా స్విమ్మింగ్ కోసం మెలాక్, పొరుగున ఉన్న బార్రా డి నవిడాడ్‌లోని బీచ్‌లను మూసివేశారు.ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు, కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేస్తూ, తదుపరి నోటీసు వచ్చేవరకు నీటిలోకి ప్రవేశించవద్దని ప్రజలను కోరారు.
అయితే మెక్సికోలో షార్క్ దాడులు చాలా అరుదు.