వాహనదారులను ఆకర్షిస్తున్న మారుతి సుజుకీ.. ఈ కార్లలో ఉండే స్పెషాలిటీలు ఇవే..!

దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ( Maruti Suzuki ) అగ్రగామిగా నిలుస్తుంది.ఈ కంపెనీకి చెందిన రెండు వేరియంట్లు వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

 Maruti Suzuki Which Is Attracting Motorists These Are The Specialties Of These C-TeluguStop.com

తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇవ్వడంతో పాటు అద్భుతమైన ఫీచర్స్ ఉండే కారు కొనుగోలు చేయాలి అనుకునే మధ్యతరగతి ప్రజలు మారుతి సుజుకీ కంపెనీకి చెందిన కార్లను కొనుగోలు చేయడానికి ఆరాటపడుతున్నారు.ఈ కంపెనీకి చెందిన కార్లలో ఉండే అద్భుతమైన ఫీచర్లు ఏంటి.

ఈ కార్లకు సంబంధించిన ధరల వివరాలు ఏమిటో తెలుసుకుందాం మారుతి సుజుకీ కంపెనీ హ్యచ్ బ్యాచ్ నుంచి ఎస్ యూవీల వరకు అన్ని రకాల మోడల్ లను మార్కెట్లోకి తెస్తూ.అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది.

అయితే ఈ కంపెనీకి చెందిన రెండు మోడళ్లు విపరీతంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.అందులో ఒక వేరియంట్ హ్యాచ్ బ్యాచ్.

మరోకటి ఎస్ యూవీ వేరియంట్.

Telugu Baleno, Latest Telugu, Maruti Suzuki, Suvs, Wagon-Technology Telugu

మారుతి సుజుకి కంపెనీ నుంచి మార్కెట్లోకి విడుదలైన హ్యచ్ బ్యాక్ పేరు బాలెనో( Baleno ).ఈ కారు 1.2 లీటర్ల నేచుల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంది.90 bhp,113 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ కారు పెట్రోల్ తో పాటు సీఎన్జీ వెర్షన్ ను కూడా కలిగి ఉంది.ఈ కారు ధర రూ.6.61 లక్షల నుండి ప్రారంభమై రూ.9.88 లక్షల వరకు ఉంటుంది.ఈ కారులో హెడ్ ఆప్ డిస్ ప్లే, 360 డిగ్రీ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ USB లాంటి సౌకర్యాలు ఉన్నాయి.

మారుతి సుజుకీ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరొక వేరియంట్ బెస్ట్ మోడల్ వ్యాగన్ ఆర్( Wagon R ).భారతదేశంలో మిగతా కంపెనీల కంటే అత్యధికంగా సేల్ అయిన కార్లలో వ్యాగన్ ఆర్ కారు ఉంది.1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్, 88.5bhp, 113 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.ఈ కారు ప్రారంభ ధర రూ.6.57 లక్షలు.ఈ కారులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో లాంటి అద్భుతమైన ఫీచర్లు మరెన్నో ఉన్నాయి.అందుకే మిడిల్ క్లాస్ నుంచి రిచ్ వరకు ఈ కార్లను బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube