టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తాజాగా ఆదివారం రోజున తుది శ్వాస విడిచిన విషయం మనందరికీ తెలిసిందే.కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అనుకున్నాయి.
కృష్ణంరాజుల కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోక సంద్రం లో మునిగిపోయారు.ఆయన అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు కృష్ణంరాజు మరణ వార్తను జన్మించుకోలేకపోతున్నారు.
సోమవారం మధ్యాహ్నం మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్‌హౌస్ వద్ద ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
అనంతరం మరోసారి రోజు అనగా మంగళవారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో టాలీవుడ్ ప్రముఖులు అందరు కలిసి కృష్ణంరాజుకు సంతాప సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, ఆదిశేషగిరిరావు, మంచు విష్ణు, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, జీవిత, కె.ఎస్ రామారావు, కె.ఎల్.నారాయణ, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అనంతరం కృష్ణంరాజు కు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కృష్ణంరాజు అంకుల్ మా ఇంటికి రావడం, మేము వాళ్ల ఇంటికి వెళ్లడంజరుగుతూ ఉండేది.

ఒకటి నాకు బాగా గుర్తుకు ఉందీ.ఏ ఫంక్షన్‌లో కలిసినా ఎక్కడికి వెళ్లినా ఆయన వచ్చేటప్పుడు మాత్రం ఎంట్రీ వేరేగా ఉండేది.ఎప్పుడూ బ్యాక్‌బోన్ స్ట్రయిట్‌గా పెట్టి నిలబడేవారు.అది చూపించి నాన్నగారు అలా ఉండాలని చెప్పేవారు.ఆయన మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ సైలెంట్‌గా వినేవారు.ఆయనకు సన్నిహితంగా ఉండే వారందరికీ తెలుసు.
నేను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పోటీకి నా పేరు చెప్పకముందు నేను నిలబడాలి అని ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది కృష్ణంరాజు అంకులే.నువ్వు నిలబడాలి అని అంకుల్ చెప్పగా నాన్నగారు అంకుల్‌కి ఫోన్ చేసి వద్దు వాడు సినిమాలు చేసుకుంటాడు అని అంటే నాన్నగారిని దబాయించారు అంటూ కృష్ణం రాజు తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మంచు విష్ణు.