విజయ్ దేవరకొండకు అభిమానులు ఫుల్ సపోర్ట్.. ఒకే ఒక్క పోస్ట్ కు ఊహించని రెస్పాన్స్!

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే.ఇటీవల లైగర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

 Vijay Devarakonda Social Media Post After Liger Flop Details, Vijay Devarakonda,-TeluguStop.com

పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాపై విజయ్ దేవరకొండ తో పాటు అభిమానులు కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు.కానీ ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా విజయ్ దేవరకొండపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అయితే సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో, విడుదలకు ముందు బాగా యాక్టివ్ గా ఉన్న విజయ్ సినిమా విడుదల తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు.

విడుదల తర్వాత తనపై ఎవరు ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా కూడా విజయ్ దేవరకొండ పట్టించుకోలేదు.

తనపై ఎవరు ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా కూడా చూసి చూడనట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు విజయ్.ఇది ఇలా ఉంటే సినిమా విడుదల అయిన తరువాత మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని పెట్టాడు విజయ్ దేవరకొండ.

సింగిల్ ప్లేయర్ అంటూ ట్వీట్ చేస్తూ ఒక క్లాసిక్ పిక్ ని షేర్ చేసాడు.ఈ పోస్టుపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు.ఏకంగా ఈ పోస్ట్ కి వేళల్లో కామెంట్స్ వచ్చాయి.కొందరు అయితే నీ సినిమా ఫ్లాప్ అయినా నువ్వు నిజమైన లైగర్‌ వి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు విజయ్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరియు కొందరు విజయ్ పై నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు.

కేవలం విజయ మాత్రమే కాకుండా నిర్మాత చార్మీ కూడా సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుంటున్నట్లు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.పూరి జగన్నాథ్ కూడా మీడియా ముందుకు వచ్చి చాలా రోజులు అయింది.ఆయన పేరు కూడా సోషల్ మీడియాలో వినిపించడం లేదు.

ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మరొక సినిమా జనగణమన. ఈ సినిమా అర్ధాంతరంగా ఆపేశారు అంటూ వార్తలు వినిపించాయి.కానీ ఆ వార్తలపై ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు.కాగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివానిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.ఇందులో విజయ్ దేవరకొండ సమంత హీరోయిన్గా నటించనుంది.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube