సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.
అయితే మేకర్స్ ప్రొమోషన్స్ కూడా షురూ చేసారు.29న ఆచార్య మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ ముందు రోజు 28న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట.ఆచార్య సినిమాకి ట్రైలర్ అటాచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి ఇది నిజం అయితే కనుక ఆచార్య థెరపీ సర్కారు బెల్ మోగడం ఖాయం.ఇది పక్కన పెడితే తాజాగా మేకర్స్ మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు.
ఈ పోస్టర్ లో మహేష్ చేతిలో వ్యాలెట్, మరో చేతిలో మనీ, పేస్ లో స్మైల్ తో చార్మింగ్ లుక్ లో ఉన్న మహేష్ అందరిని అలరిస్తున్నాడు.
ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో విదేశీ అందాలు కనువిందు చేస్తుండగా.ఈ ఫోటో మహేష్ అభిమానులను ఆకట్టుకు ఉంటుంది.ఈ ఫోటో చూసిన అభిమానులు మహేష్ లుక్ కు ఫిదా అవుతున్నారు.ఈ ఫొటోలోని ఇంత అందంగా కనిపిస్తున్న మహేష్ ఇక పెద్ద స్క్రీన్ మీద చుస్తే మరెంత అందంగా కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచాయి. కళావతి సాంగ్ తో పాటు, పెన్నీ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.ఇక ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.మొన్న రిలీజ్ అయినా టైటిల్ సాంగ్ కూడా ఆకట్టు కుంది.దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం అందరు ఎదురు చేస్తున్నారు.