కరోనాపై పోరు: తక్కువ ఖర్చుతో వెంటిలేటర్‌.. అమెరికాలో భారత సంతతి జంట అద్భుతం

ప్రపంచాన్ని చివురుటాకులా వణికిస్తున్న కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలో తెలియక శాస్త్రవేత్తలు మల్లగుల్లాలు పడుతున్నారు.ఇప్పటికే వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు అన్ని దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.

 Indian-american Couple Develops Low-cost Ventilator For Covid-19 Patients, Ameri-TeluguStop.com

ఇకపోతే కరోనా వైరస్ సోకి పరిస్ధితి విషమంగా ఉన్న వారిని కాపాడటంతో వెంటిలేటర్లు కీలక పాత్ర పోషిస్తాయి.అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో వాటి ధర మాత్రం చుక్కలను తాకుతోంది.

చాలా దేశాల్లోని ఆసుపత్రులు వెంటిలేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో ఓ భారతీయ- అమెరికన్ జంట తక్కువ ధరలో పోర్టబుల్ ఎమర్జెన్సీ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది.

ప్రతిష్టాత్మక జార్జ్ డబ్ల్యూ వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్‌ సంస్థలో ప్రొఫెసర్ వ్యవహరిస్తున్న డాక్టర్ దేవేశ్ రంజాన్, ఆయన భార్య కుముదా రంజాన్‌లు ప్రోటో‌టైప్ కాన్సెప్ట్‌తో వెంటిలేటర్‌ను తయారు చేశారు.ఇది 100 డాలర్ల కన్నా తక్కువ ధరకే ఉత్పత్తి చేయవచ్చునని రంజాన్ దంపతులు తెలిపారు.

ఇదే రకమైన వెంటిలేటర్. అమెరికాలో సగటున 10,000 డాలర్లు ఉంటుందని అంచనా.

ఊపిరితిత్తులు విఫలమైన సందర్భంలో వెంటిలేటర్‌ ద్వారా రోగికి శ్వాస ప్రక్రియను అందించవచ్చు.ఇటువంటి పరిస్ధితిని వైద్య పరిభాషలో ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌ అంటారు.

దీనిని పరిష్కరించడానికే ఈ ఓపెన్ ఎయిర్‌‌వెంట్‌జీటీని అభివృద్ధి చేశారు.

Telugu America, Coronavirus, Covid, Devesh Ramzan, Indian American, Kuvesh Ramza

కుముదా రంజాన్ ఆరేళ్ల వయసులో తన తల్లిదండ్రులతో రాంచీ నుంచి యూఎస్ వలస వెళ్లారు.ఆమె న్యూజెర్సీలో వైద్యశాస్త్రాన్ని అభ్యసించారు. ప్రొఫెసర్ దేవేశ్ రంజాన్ మాట్లాడుతూ… అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న వెంటిలేటర్‌‌ను భారత్, ఆఫ్రికా వంటి దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని అభివృద్ధి చేశామని తెలిపారు.

ఈ నమూనాను సింగపూర్‌కు చెందిన రెన్యూ గ్రూప్ ఉత్పత్తి చేస్తోంది.ఓపెన్ ఎయిర్‌వెంట్‌జీటీ తయారీ, పంపిణీ చేయడానికి ఈ సంస్థ కసరత్తు చేస్తోంది.కాగా ఇప్పటి వరకు 17,06,226 మంది వైరస్ బారినపడగా.99,805 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube