ప్రస్తుత కాలంలో కొందరు తామున్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా తమ కుటుంబాలు విషాదం పాలవుతున్నాయి.తాజాగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నటువంటి ఇద్దరు ప్రేమికులు కష్టపడి తమ పెద్దలను ఒప్పించి చివరికి నిశ్చితార్థం కూడా చేసుకుని అనుకోకుండా ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి గణేష్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందినటువంటి ఓ యువతిని గత కొద్ది కాలంగా గాఢంగా ప్రేమిస్తున్నాడు.కాగా తన గణేష్ తన ప్రేమ విషయం గురించి యువతికి చెప్పడంతో ఆమె కూడా ఓకే చెప్పింది.
దీంతో ఇద్దరూ పెళ్ళి చేసుకుని హాయిగా గడపాలని కలలు కన్నారు.కానీ వీరి కలలకి కొంతమేర కుటుంబ సభ్యులు మొదట్లో అడ్డం వచ్చినప్పటికీ ఎలాగోలా కష్టపడి ప్రేమికులిద్దరు తమ కుటుంబ సభ్యులను ఒప్పించారు.
అంతేగాక ఇద్దరు కలిసి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.అయితే వీరి ప్రేమ బంధానికి కరోనా వైరస్ కారణంగా విధించినటువంటి లాక్‌డౌన్ శాపంగా మారింది.నిశ్చితార్థం అనంతరం పెళ్లి చేసుకుందామనే లోపు లాక్ డౌన్ విధించడంతో కొంతకాలం పాటు పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ ప్రతిసారి కొనసాగిస్తుండడంతో ప్రేమికులు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
కానీ అందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.స్థానికుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచించకుండా ప్రేమికులు ఇద్దరు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.అంతేగాక చేతికి అందొచ్చిన యువతీ యువకులు ఇలా చేయడం సరికాదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.