తాజాగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన 2021-2022 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరాశనే మిగిల్చిందని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.కేంద్ర బడ్జెట్ అదేవిధంగా ఏపీ సీఎం జగన్ పై భారీ స్థాయిలో డైలాగులు వేశారు.
అవినీతి కేసులను తప్పించుకోవడానికి సీఎం జగన్ కేంద్రంలో ఎంపీలను తాకట్టు పెట్టారని లోకేష్ సెటైర్లు వేశారు.
సోషల్ మీడియాలో తాజా పరిణామాలను బట్టి లోకేష్ ఈ విధంగా స్పందించారు… జనాన్ని మోసంచేసే రెడ్డి… జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్రాన్ని దగా చేశారు.25 మంది ఎంపీలని ఇస్తే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా సాధిస్తానని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి.చివరికి తన 31 కేసుల నుంచి తప్పిస్తే చాలు.
ప్రత్యేక హోదా ఊసెత్తనని 28 ఎంపీల్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు.విభజనచట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన హామీలకు బాబాయ్ హత్య కేసుతో చెల్లు చేసింది కేంద్రం.
బడ్జెట్‌లో నిధులు కేటాయించక్కర్లేదు కానీ, సహనిందితులైన అధికారులను తనకు కేటాయిస్తే చాలని.కేంద్రం వద్ద సాగిలపడ్డారు సీఎం జగన్ మోహన్‌రెడ్డి.
అప్పులు వాడుకోవడానికి అనుమతిస్తే చాలు.ఏ ప్రాజెక్టులివ్వకపోయినా ఫర్వాలేదని ఒప్పందం చేసుకున్నారు.బడ్జెట్‌లో ఏపీకి ఏమీ ఇవ్వని కేంద్రాన్ని ఏమీ అనలేని నిస్సహాయస్థితిలో వున్నారు జగన్ రెడ్డి.” అంటూ నారా లోకేష్ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.