బాబు క్లారిటీ: కాంగ్రెస్ తో టీడీపీ....ఆ ప్రయాణం ఎందుకంటే...?

కాంగ్రెస్ – టీడీపీలు అంటే ఆజన్మ విరోధులు.అసలు టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగింది.

 Chandrababu Gives Clarity About Alliance With Congress Party-TeluguStop.com

అటువంటి పార్టీతో టీడీపీ కలిసి ముందుకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు.కానీ ఆ పొత్తు విచ్చుకుంది.

తెలంగాణాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాకూటమిలో టీడీపీ చేరిపోయింది… అంతే కాదు ఆ కూటమికి.కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో అంతా నేనే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించాడు.

కానీ అక్కడ ఆ పొత్తు వర్కవుట్ కాలేదు.దీంతో ఇప్పుడు అందరిలోనూ ఏపీలో ఈ రెండు పార్టీల స్టాండ్ ఏంటి అనే కొత్త సందేహాలు మొదలయ్యాయి.

అలాగే ఏపీ కాంగ్రెస్ లోనూ అనేక సందేహాలు ఉన్నాయి.అసలే పార్టీ పరిస్థితి ఇక్కడ అంతంతమాత్రంగానే ఉంది.

ఈ దశలో ఒంటరిగా వెళ్లలేక టీడీపీ తో జతకట్టి ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకోవాలనే దుస్థితిలో ఆ పార్టీ ఉండిపోయింది.ఇది ఇలా ఉంటే ఏపీలో టీడీపీ – కాంగ్రెస్ దోస్తీల మీద అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు చంద్రబాబు.

ఇదే విషయమై టీఆజగా మీడియాతో మాట్లాడిన బాబు… నేను ఏదో నా కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నాను అని చాలామంది విమర్శలు చేస్తున్నారనీ, కానీ… అలాంటి పరిస్థితి లేదన్నారు.‘దేశానికి నష్టం కలుగుతోంది బీజేపీ వల్ల, అన్ని రాజకీయ పార్టీలు కలిసి దేశాన్నీ ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాలి’ అన్నారు.ఆంధ్రాకు తీవ్రమైన నష్టం చేసిన పార్టీ బీజేపీ అనీ, రాష్ట్ర ప్రయోజనాలూ దేశ ప్రయోజనాలూ కాపాడుకోవాలనుకున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకున్నప్పుడు.అందరూ కలిసి ముందుకుపోవాలని పెట్టామన్నారు.దీన్ని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు.ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ.

ఆ పార్టీతో చాన్నాళ్లుగా పోరాటం చేశామనీ, కానీ కేంద్రంలో బీజేపీని గద్దెదించాలంటే అన్ని పార్టీలతో కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.విశాఖలో జరిగిన ఓ సదస్సులో కూడా ఇదే అంశం ప్రస్థావిస్తూ.

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా మద్దతు ఇవ్వడమే తన అజెండా కాందంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు.

ఇప్పుడు చంద్రబాబు ఆలోచన అంతా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయడమే.అందుకే… కాంగ్రెస్ కేంద్రంలో అధికారం చేపట్టాలని కోరుకుంటూ… ఎన్ని విమర్శలు వచ్చినా … ఆ పార్టీతో జతకట్టి ముందుకు వెళ్తున్నాడు.అందుకే తెలంగాణాలో చేదు ఫలితాలు వచ్చినా… ఏపీలో రాజకీయ పరిస్థితులు వేరు అక్కడిలా ఇక్కడ ఉండదు అంటూ చెప్పుకొస్తున్నారు.ముఖ్యంగా… ఆంధ్రాలో రాబోయే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు వేరు.రాష్ట్రంతోపాటు, కేంద్రంలో కూడా అధికారం చేపట్టబోయే పార్టీని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎన్నికలకు ఎదుర్కోవాల్సి ఉంది.ఎందుకంటే, ఏపీకి కేంద్రం చేయాల్సింది చాలా ఉంది.అందుకే… ఈ రెండు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే.కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరమూ ఉంది అని బాబు బలంగా వాదిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube