'నాదెండ్ల ' త్యాగానికి సిద్ధం కావాల్సిందేనా ? 

ఏపీలో టిడిపి, జనసేన పార్టీల( TDP and Janasena party in AP ) మధ్య పొత్తు అధికారికంగా కుదరకపోయినా, అనధికారికంగా కుదిరినట్టే.సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒకటే మిగిలింది .

 Do You Have To Prepare For The Sacrifice Of Nadendla Details, Nadendla Manohar,-TeluguStop.com

ఏపీలో ఏఏ స్థానాల్లో టిడిపి , జనసేనలు పోటీ చేయాలి ? ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు పంచుకోవాలనే విషయం పైనే జనసేన , టిడిపిలో మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి.జనసేనకి బలం ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది.

టీడీపీ కూడా తమకు బలం ఉన్న నియోజకవర్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు కేటాయించకూడదనే ఆలోచనాతో ఉంది.అయితే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారం చంద్రబాబు,  పవన్ కళ్యాణ్ నిర్ణయం ఆధారంగా ఉంటుందని ఇప్పటికే జనసేన రాజకీయాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Nadendla Manohar is the Chairman of Janasena Politics Committee ) ప్రకటించారు.

అలా ప్రకటించిన కొద్ది రోజులకు ఆయన తెనాలి నియోజకవర్గంలో( Tenali Constituency ) పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు.పొత్తులు, సీట్ల వ్యవహారం పై రెండు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని ప్రకటించిన నాదెండ్ల మనోహర్,  తన సీటు విషయంలో మాత్రం సొంతంగా ప్రకటన చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Telugu Alapatirajendra, Ap, Janasena, Jansenani, Nadendlamanohar, Pavan Kalyan,

అయితే టిడిపి నుంచి ఈ సీటు విషయంలో తీవ్రమైన పోటీ నెలకొనబోతుండడం,  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటును పొత్తులో భాగంగా వదులుకోకూడదని తెలుగుదేశం డిసైడ్ కావడంతోనే ముందుగానే నాదెండ్ల మనోహర్ ఈ ప్రకటన చేశారని అర్థం అవుతుంది.గత ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గాలను జనసేనకు ఇచ్చేందుకు టిడిపి ఇష్టపడడం లేదు.జనసేన తో పొత్తు పెట్టుకున్నా,  ఒంటరిగా అధికారంలోకి వచ్చి, సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో టీడీపీ ఉంది.దీంతో తెనాలి సీటును వదులుకోకూడదని టిడిపి భావిస్తుంది. 2019 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థికి 94,000 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థికి 76,000 ఓట్లు, జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 29 వేల ఓట్లు వచ్చాయి.ఇప్పుడు కూడా తెనాలి నియోజకవర్గంలో జనసేన కంటే టిడిపి బలంగా ఉండడంతో ఆస్థానాన్ని వదులుకోకూడదని , అక్కడ టిడిపి అభ్యర్ధిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ నే నియమించాలి అని చంద్రబాబు భావిస్తున్నారు.

Telugu Alapatirajendra, Ap, Janasena, Jansenani, Nadendlamanohar, Pavan Kalyan,

పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన కు సీటు కేటాయించే అవకాశం కనిపించడం లేదు.దీనికి బదులుగా గుంటూరు జిల్లాలో మరో నియోజకవర్గం నుంచి నాదెండ్లను పోటీ చేసుకోవాలనే సంకేతాలు టీడీపీ పంపుతోంది.దీంతో ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబడితే తప్ప , పొత్తు లో భాగంగా తెనాలి లో సీటు జనసేనకు దక్కే అవకాశం లేదు.ఒక టిడిపి ఈ సీటు విషయంలో గట్టిగా పట్టుబడితే నాదెండ్ల మనోహర్ త్యాగానికి సిద్ధం కావాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube