ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది అంటే డార్లింగ్ ప్రభాస్( Prabhas ) నటిస్తున్న ‘ఆదిపురుష్’ ( Adipurush ) అనే చెప్పాలి.ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
ఇక బాలీవుడ్ స్టార్ హీరో లంకేశ్వరుడు రావణాసురుడిగా నటించాడు.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా మరో వారం తర్వాత రిలీజ్ అవుతుండడంతో ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది.రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మొన్ననే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి భారీ అంచనాలను పెంచేసిన ఆదిపురుష్ మేకర్స్ ఫైనల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసుకున్నారు.
ఈ ట్రైలర్ తో మరిన్ని భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మాసివ్ ప్రాజెక్ట్ నుండి తాజాగా పలు ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి.బాలీవుడ్ స్టార్స్ తమవంతు ఆదిపురుష్ సినిమాకు హైప్ పెంచేస్తున్నారు.ఇప్పటికే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అండ్ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తమ వైపు నుండి ఒక్కొక్కరు 10 వేల టికెట్స్ కొని పేదవారికి, అనాథలకు ఇచ్చి ఆదిపురుష్ సినిమాను చూపించే విధంగా చేస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.
ఇవి నెట్టింట వైరల్ అవుతుండగానే మన టాలీవుడ్ స్టార్ హీరో కూడా ఇదే పని చేయబోతున్నట్టు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan ) కూడా 10 వేల ఆదిపురుష్ టికెట్స్ కొని అనాథ పిల్లల కోసం పంచనున్నారు అని ఒక టాక్ నెట్టింట వైరల్ అయ్యింది.ప్రస్తుతానికి ఈ విషయంలో నిజానిజాలు తెలియలేదు కానీ ఆల్ మోస్ట్ ఇది నిజమే అని అంటున్నారు.చూడాలి ఇదే నిజమైతే బయటకు ఖచ్చితంగా వస్తుంది.