ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ( TDP ) గెలుపు దిశగా అడుగులు వేస్తోంది.ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత రా కదలి రా పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా నారా లోకేశ్( Nara Lokesh ) ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.ఈ మేరకు ఈనెల 11వ తేదీ నుంచి ‘శంఖారావం’( Shankaravam ) పేరుతో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ఇటీవల చేసిన యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) జరగని ప్రాంతాల్లో ఈ సారి పర్యటించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలుస్తోంది.కాగా ఉత్తరాంధ్ర నుంచి నారా లోకేశ్ శంఖారావం ప్రారంభం కానుంది.ఈ క్రమంలోనే శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను టీడీపీ విడుదల చేసింది.