ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు శాసనసభలో ప్రకటించిన జగన్ నేడు శాసన మండలి ని రద్దు చేస్తూ గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
దీంతో జగన్ ఒక్కో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ వస్తున్నాడంటూ ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్న , ప్రభుత్వం మాత్రం దీనికి కారణాలు జనాలకు అర్థం అయ్యేలా చెబుతోంది. ఇది ఇలా ఉంటే , ఏపీ అసెంబ్లీ లో 151 మంది శాసనసభ్యులతో పాటు , ఇతర పార్టీల నుంచి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో వైసిపి బలంగా ఉంది.
కానీ శాసనమండలిలో మొన్నటి వరకు టిడిపి బలం ఎక్కువగా ఉండడం వల్ల శాసనసభలో తీసుకున్న నిర్ణయాలు శాసనమండలిలో టిడిపి అడ్డుకుంటూ రావడం జగన్ ప్రభుత్వానికి తీవ్ర అసహనం కలిగిస్తూనే వచ్చింది.
ఇప్పుడు టిడిపి శాసన మండలి సభ్యుల చాలామంది గడువు ముగియడం తో వైసిపి బలం బాగా పెరిగింది.
ఇప్పుడు 14 మంది ఎమ్మెల్సీలు కొత్తగా శాసన మండలికి రాబోతున్నారు.ఈరోజు ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేశారు. ఈనెలాఖరున మరో 11 మంది ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల నుంచి వైసీపీ తరఫున అడుగు పెట్టబోతున్నారు.దీంతో మండలిలో వైసిపి బలం 32 కు పెరగనుంది.

అయితే శాసనమండలి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి గల కారణాలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరించారు.కొత్త శాసనమండలి సభ్యుల రాక కారణంగా, శాసనమండలిలో ఇకపై అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు యధాతధంగా ఆమోదం పొందుతాయని, గతంలో ఈ పరిస్థితి లేకపోవడంతోనే, శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసినట్లు రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.ఇక టీడీపి కి శాసనమండలిలో బలం తగ్గిపోవడంతో ఆ పార్టీ పాత్ర నామమాత్రమే.