తలంగాణలో బిజెపి టిఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది.ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటూ, తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు.2023 ఎన్నికల్లో బిజెపి, టిఆర్ఎస్ మధ్య పోటీ మరింత తీవ్రతరం కానుంది.రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదే కావాలంటే ఖచ్చితంగా పార్టీలో చేరికలు ఉండాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.
ఈ మేరకు చేరికలపై దృష్టి సారించాయి.ఇక విషయానికి వస్తే బిజెపిలో ఓ పార్టీ విలీనం కాబోతున్నట్లు సమాచారం.
జిట్టా బాలకృష్ణ రెడ్డి స్థాపించిన యువ తెలంగాణ పార్టీ ఈనెల 16వ తేదీన బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు సమాచారం.ఈ విలీనాన్ని కూడా కేంద్ర మంత్రులు సమక్షంలోనే చేయబోతున్నారట.
ఈ మేరకు 30 వేల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించి మరి విలీనం చేయబోతూ ఉండడంతో బిజెపి బలం మరింతగా పెరగనుంది.
యువ తెలంగాణ పార్టీకి అధ్యక్షుడి గా జిట్టా బాలకృష్ణారెడ్డి ఉండగా, పార్టీ ప్రధాన కార్యదర్శి గా రాణి రుద్రమదేవి ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి పది జిల్లాలకు అధ్యక్షులను నియమించింది.పార్టీ తరపున ఇప్పటికే ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.జిట్టా బాలకృష్ణా రెడ్డి గురించి చెప్పుకుంటే 2009లో కేసీఆర్ తో విభేదించి ఆయన భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 44 వేల ఓట్లు సాధించారు.అలాగే 2014 ఎన్నికల్లోనూ 40 వేల ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు .2018 ఎన్నికల్లోనూ యువ తెలంగాణ పార్టీ ని స్థాపించి బిజెపి సహకారంతో పోటీ చేసి ఓటమి చెందారు.పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాణిరుద్రమ 2021లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
అయినా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడుతూ , క్షేత్రస్థాయిలో చాలా జిల్లాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.
ఈ పార్టీ ఇప్పుడు బిజెపి లో విలీనం కాబోతూ ఉండడంతో టిఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.ఈనెల 16వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మరికొంతమంది కేంద్రమంత్రులు ఆధ్వర్యంలో యువ తెలంగాణ పార్టీ ని విలీనం చేయబోతున్నారట.ఈ వ్యవహారాలపై టిఆర్ఎస్ ఆరా తీస్తోంది.
ఆ పార్టీ విలీనం అయితే బిజెపికి ఏమేరకు బలం చేకూరుతుంది.? ఏ ఏ నియోజకవర్గాల్లో ఆ ప్రభావం కనిపిస్తుంది ఇలా అనేక అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారట.