సీఎం జగన్ సంచలన నిర్ణయం.. దయచేసి ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావద్దు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి వర్షాలు భారీగా కురుస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 Cm Jagan Sensatational Decision On Flood Effected Areas Mlas, Cm Jagan,ap Floods-TeluguStop.com

ముఖ్యంగా దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ ప్రాంతంలో పలు జిల్లాలలో.కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాలు జలదిగ్బంధంలో కి వెళ్లిపోయాయి.

రాయలసీమ ప్రాంతాలలో చిత్తూరు.నెల్లూరు జిల్లాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

లోతట్టు ప్రాంతాలు నిండిపోవడం తోపాటు చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరుకోవడంతో పాటు విద్యుత్ స్తంభాలు పడిపోయి కరెంట్ సరఫరా కూడా నిలిచి పోవడం జరిగింది.వర్షాల కారణంగా రాష్ట్రంలో 27 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు.

ప్రభుత్వం ఏని జాగ్రత్తలు తీసుకుంటున్న గాని ప్రకృతి సృష్టిస్తున్న బీభత్సానికి ప్రజలు… బిక్కుబిక్కుమంటూ.బాధితులు ఇళ్ళలను వదిలేసి కట్టుబట్టలతో మిగిలి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని చోట్ల పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో.అని జిల్లాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వస్తూ ఉన్నారు.

కాగా ఈ నెల 26వ తారీకు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో సీఎం జగన్ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేయడం జరిగింది.

వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదని.వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా ఇన్చార్జి మంత్రులు, జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు.ప్రజలకు తక్షణ సాయం అందేలా.

పర్యవేక్షించాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube