ప్రముఖ సినీ నటి రోజా 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి నగరి నియోజకవర్గం తరపున పోటీ చేసి అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.అయితే 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాలేదు.2019 సంవత్సరంలో రోజా ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు వైసీపీ అధికారంలోకి రావడం రోజా పొలిటికల్ కెరీర్ కు ప్లస్ అయింది.తాజాగా రోజాకు జగన్ మంత్రి పదవి కూడా ఇచ్చారు.
మంత్రి పదవి వచ్చిన తర్వాత సినిమాలకు టీవీ షోలకు గుడ్ బై చెప్పిన రోజా గతంతో పోలిస్తే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరింత సమయం కేటాయించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందే విధంగా రోజా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే తాజాగా రోజా ప్రజల సమస్యలను వింటున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో రోజా వృద్ధుడితో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న 2,500 రూపాయల పింఛన్ వస్తుందా అని అడిగారు.
ఆ ప్రశ్నకు వృద్ధుడు వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధి పొందుతున్నానని వెల్లడించారు.ఆ తర్వాత వృద్ధుడు తన భార్య చనిపోయిందని తనకు పెళ్లి జరిపించాలని మనసులోని కోరికను వెల్లడించారు.
వృద్ధుడి మాటలు విన్న రోజా ఆశ్చర్యానికి గురయ్యారు.

అయితే రోజా మేము పెళ్లి చేయించలేమని చెబుతూ వృద్ధుడి ప్రశ్నకు రివర్స్ లో కౌంటర్ ఇచ్చారు.రోజా మరి కొందరు ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేశారు.రోజా ప్రజల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉండటంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి రోజా మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే రోజాకు మరోసారి మంత్రి పదవి గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.







