‘‘ లగాన్ ’’ పాట రీమిక్స్‌తో భారతీయులకు ఎర: బిడెన్ మద్ధతుదారుల వినూత్న యత్నం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న భారతీయ సమాజం మద్ధతును కూడగట్టుకోవడానికి రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కిందా మీద పడుతున్నారు.ఇప్పటికే భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష బరిలో దింపి ఇండో అమెరికన్లను ఆకట్టుకున్న డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.

 Joe Biden Camp Releases Remix Of 'lagaan' Song To Woo Indian-americans, Joe Bide-TeluguStop.com

ఆయన పార్టీకి చెందిన ఇండో అమెరికన్ జంట అజయ్ , వీనిత భూటోరియాలు బిడెన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.సోషల్ మీడియాలో వీడియోల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న భూటోరియా దంపతులు.తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ లగాన్‌లోని ‘చలే చలో, చలే చలో’ అనే పాటను రీమిక్స్ చేశారు.‘చలే చలో, చలే చలో.బిడెన్ కొ ఓట్ దొ.బిడెన్ కి జీత్ హో.ఉన్‌కి హార్ హాన్’ అంటూ సాగే ఈ పాట ద్వారా భారతీయులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

కాగా భారతీయ-అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేయడానికి బిడెన్ ‘అమెరికా కా నేత కైసే హో… జో బిడెన్ జైసా హో ( అమెరికా అధ్యక్షుడు… జో బిడెన్ మాదిరిగా ఉండాలి)’ అన్న నినాదం తో ప్రచారం చేస్తుండడం విశేషం.

బిడెన్ జాతీయ ఆర్థిక కమిటీ సభ్యుడిగా వ్యవహరిస్తున్న అజయ్ భూటోరియా ఆయనకు ఈ విషయంలో అండగా నిలుస్తున్నారు.
భారతీయ భాషలైన హిందీ, పంజాబీ, తమిళం, తెలుగు, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మలయాళీ, ఒరియా, మరాఠీలతోపాటు నేపాలీ భాషలోనూ ప్రసంగించేందుకు బిడెన్ యత్నిస్తున్నారు.

నవంబర్ 3న జరగనున్న ఈ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను జో బిడెన్ ఢీకొట్టనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube