గతేడాది డిసెంబర్ లో ప్రముఖ టీవీ నటుడు కుశాల్ పంజాబీ ఆత్మహత్య ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.కెరీర్ బాగా సాగుతున్న సమయంలో కుశాల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలచి వేసింది.
ముంబై లోని బాంద్రా లో కుశాల్ తన ఇంట్లోనే ఫ్యాన్ కు నైలాన్ తాడు ను ఉపయోగించి ఉరివేసుకున్నాడు.అయితే ఇంకా ఈ ఘటన మరువక ముందే మరో టీవీ నటి ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదం నింపింది.
దిల్ తో హ్యాపీ హై జీ అనే సీరియల్ హీరోయిన్ సెజల్ శర్మ తన ముంబై లోని తన గదిలో సూసైడ్ చేసుకుంది.ముంబై లోని మీరా రోడ్డు లో నివసిస్తున్న సెజల్ సూసైట్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ ఇంట్లో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నట్లు సమాచారం.అయితే ఏ కారణంగా సెజల్ ఆత్మహత్యకు పాల్పడింది అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రాజస్థాన్ లోని ఉడియాపూర్ కు చెందిన సెజల్ నటి అవ్వాలన్న మక్కువ తో 2017 లో ముంబై చేరుకుంది.
ఆ తరువాత ఆమె ఆజా పరిందే అనే వెబ్ సిరీస్ లో కూడా అవకాశాన్ని అందుకొని నటించారు.
అంతేకాకుండా పలువురు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించిన అనుభవం కూడా ఉంది సెజల్ కి.అయితే ఇప్పుడు దిల్ తో హ్యాపీ హై జీ టీవీ సీరియల్ తో అందరికీ దగ్గర అయ్యారు.అయితే ఇలాంటి సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అందరినీ దిగ్బ్రాంతికి గురిచేసింది.
అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్ధం కాక తోటి నటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.