తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) దూరంగా ఉండనున్నారు.ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో ఒకటి లేదా రెండు రోజులపాటు ఆయన పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నెల 13వ తేదీన నల్గొండ( Nalgonda )లో భారీ బహిరంగ సభ ముగిసిన తరువాత కేసీఆర్ అసెంబ్లీకి ( Telangana Assembly )హాజరయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని తెలుస్తోంది.
అయితే ప్రాజెక్టులను కేఆర్ఎంబీ( KRMB )కి అప్పగించడంపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ. బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే.