అమెరికాలో 13 ఏళ్ల బాలికని లైంఘికంగా వేధించినందుకు గాను తెలుగు క్రైస్తవ మతబోధకుడికి 6 ఏళ్ల జైలు శిక్ష పడింది.అమెరికాలో తెలుగు వాళ్ళు భారత దేశానికి తాము పుట్టిన ప్రాంతానికి పేరు తీసుకువస్తుంటే ఇలాంటి వ్యక్తులు తెలుగోళ్ళ పరువుతీస్తున్నారని పలువురు ఫైర్ అవుతున్నారు.
వివరాలలోకి వెళ్తే.
ఇటుకలపాటి జాన్ ప్రవీణ్ అనే వ్యక్తి ర్యాపిడ్ సిటీ చర్చిలో రోమన్ కేథలిక్ బిషప్ ఆధ్వర్యంలో క్రైస్తవ మతబోధనలో 10 ఏళ్ల అసైన్మెంట్ పై 2017 డిసెంబర్ అమెరికా వెళ్ళాడు.ర్యాపిడ్ సిటీ చర్చికి వచ్చే ఓ 13-ఏళ్ల బాలికను అతడు లైంగికంగా వేధించసాగాడు.దాంతో ఆ బాలిక తన తల్లి తండ్రులకి చెప్పగా వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు.దాంతో 178 రోజుల పాటు జైలులో అండర్‌ట్రయల్‌గా ఉన్న ప్రవీణ్‌కు శుక్రవారం రోజున జడ్జి శిక్షని ఖరారు చేసేశారు.ఇదిలాఉంటే కేసు దర్యాప్తులో భాగంగా ప్రవీణ్ కి 16 ఏళ్ల బాలికతో అక్రమ సంభంధం ఉన్నట్టుగా తేలింది దాంతో ఈ శిక్ష మరింత పెరిగి 15ఏళ్ళు కావచ్చని అంటున్నారు అధికారులు.