కాలిఫోర్నియాలో 8 ఏళ్ల పాప రికార్డ్ సృష్టించింది.ఆమె తెలివితేటలకి మెచ్చుకున్న పోలీసులు ఆమెని సత్కరించి అవార్డ్ కూడా ప్రకటించారు.
ఆవివరాలలోకి వెళ్తే.ఆమె పేరు ఇసాబెల్ పీర్స్, ఆమె తన తండ్రితో కలిసి వెళ్తూ ఉండగా భారీ శబ్దంతో ఆ కారు డ్రైవర్ వైపు ఉన్న కారు కిటికీ అద్దం పగిలిపోయింది.
ఒక్క సారిగా తన తండ్రివైపు చూస్తే.
ఛాతీ నుంచి రక్తం కారడం కనిపించింది.దాంతో ఒక్క సారిగా షాక్ కి గురయిన ఆమె తేరుకుని చూస్తె ఎవరో తుపాకీతో కాల్పులు జరిపితే ఆ బులెట్ వచ్చి అతని గుండెల్లో దిగబడింది.వెంటనే ఇసాబెల్ వెంటనే కారులో ఉన్న స్వెట్ బాండ్ తీసుకుని తండ్రి ఛాతీ నుంచీ రక్తం రాకుండా అదిమి పట్టింది.
దాంతో రక్తం కొంత మేరకు తగ్గడంతో కారుని నెమ్మదిగా దగ్గరలోని ఫైర్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి అక్కడి అధికారులతో విషయం చెప్పి తన తండ్రిని .ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేసింది.
ఆమె తీసుకున్న నిర్ణయంతో తన తండ్రి ప్రాణాలు నిలిచాయని లేకపోతె అతడు చనిపోయే వాడని వైద్యులు తెలిపారు.దాంతో ఆమె సమయస్పూర్తికి మెచ్చుకుని పోలీసులు ఆమె సాహసానికి ప్రతీకగా ఓ అవార్డును ఇచ్చారు.
.