ఏప్రిల్ లో రాబోతున్న మెగా 'ఉప్పెన'...  

మెగాస్టార్ ఇంటినుంచి మరో హీరోని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.అయితే  ఆ హీరో ఎవరనుకుంటున్నారా…?, అతడు ఎవరో కాదు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.అయితే ఇప్పటికే ఈ  చిత్రాన్ని పలువురు సినీ పెద్దల సమక్షంలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

 Is Uppena Movie Releasing In 2020 April-TeluguStop.com

ఈ చిత్రానికి నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తూ అతడు కూడా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమవుతున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఐనటువంటి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ  చిత్రానికి సంబంధించి హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి.

ఈ చిత్రంలో విలన్ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.అయితే విజయ్ సేతుపతి పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదలవడంతో విజయ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Telugu Uppena April, Telugu Uppena, Uppenalatest, Uppena Latest, Uppena Telugu,

దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.ఇందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తియినట్లు తెలుస్తోంది.అయితే వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం కావడంతో మెగా అభిమానులు కూడా ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు.మరి వైష్ణవ్ తేజ ఉప్పెన తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube