ఏప్రిల్ లో రాబోతున్న మెగా 'ఉప్పెన'...  

ఏప్రిల్ లో రాబోతున్న మెగా ‘ఉప్పెన’…  

మెగాస్టార్ ఇంటినుంచి మరో హీరోని గ్రాండ్ గా లాంచ్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

ఏప్రిల్ లో రాబోతున్న మెగా ‘ఉప్పెన’…  

అయితే  ఆ హీరో ఎవరనుకుంటున్నారా.?, అతడు ఎవరో కాదు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.

ఏప్రిల్ లో రాబోతున్న మెగా ‘ఉప్పెన’…  

అయితే ఇప్పటికే ఈ  చిత్రాన్ని పలువురు సినీ పెద్దల సమక్షంలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తూ అతడు కూడా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమవుతున్నాడు.

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఐనటువంటి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ  చిత్రానికి సంబంధించి హీరో వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి.

ఈ చిత్రంలో విలన్ పాత్రలో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.

అయితే విజయ్ సేతుపతి పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదలవడంతో విజయ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

"""/"/ దీంతో చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరణ కూడా పూర్తియినట్లు తెలుస్తోంది.

అయితే వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రం కావడంతో మెగా అభిమానులు కూడా ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు.

మరి వైష్ణవ్ తేజ ఉప్పెన తో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.