పవన్ కళ్యాణ్ సినిమాలో లేడీ వకీలుగా రేణు దేశాయ్...

దాదాపు మూడేళ్ల తర్వాత రాజకీయాల్లో నుంచి మళ్లీ టాలీవుడ్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న టువంటి వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

 Is Renu Desai Will Play Lawyer Role In Pawan Kalyan Movie-TeluguStop.com

అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు మరియు పలువురు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఓ వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తుందని పలు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాక ఇప్పటికే దర్శకుడు శ్రీరామ్ వేణు కూడా ఈ చిత్ర కథాంశాన్ని రేణు దేశాయ్ తో చెప్పాడట.

అయితే కథ విన్నటువంటి రేణు దేశాయ్ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర అయినందువలన వెంటనే ఓకే చెప్పిందట.అయితే అధికారికంగా ఈ విషయంపై ప్రకటనలు రాలేదు కానీ సైలెంట్ గా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.

అయితే ఏదేమైనప్పటికీ పెళ్లయిన తర్వాత సినీ పరిశ్రమకు దూరం అయినటువంటి రేణు దేశాయ్ మళ్లీ పవన్ చిత్రంతోనే సినీ పరిశ్రమలోకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ విషయం పై పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

Telugu Renudesai, Renu Desai-Movie

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి మరో చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఈ చిత్రం కూడా దాదాపుగా సైలెంట్ గానే చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం.అయితే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube