తెలంగాణా రాజకీయ చరిత్ర లో చాలా విభిన్నమైన రాజకీయవేత్తగా కేసీఆర్( XM KCR ) కు పేరు ఉంది.24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాను చెప్పుకునే చాలా మంది రాజకీయ నాయకులకు భిన్నంగా ఆయన ఫామ్ హౌస్ రాజకీయాలు నడుపుతూ ఉంటారు.సచివాలయానికి రాకుండా అధికారులను ఫామ్ హౌస్ కి రప్పించుకుంటూ నియంత మాదిరిగా పాలనను నడిపిస్తూ ఉంటారని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనట్లుగా ఉండే కేసీఆర్, అవసరమైనప్పుడు మాత్రం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్థులను అయోమయంలో పడేస్తుంటారు.ముఖ్యంగా వచ్చే ఎన్నికలకు బారాసాను కేసీఆర్ ప్రిపేర్ చేస్తున్న తీరు, ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తున్న వేగం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

అవినీతి ఆరోపణలు మరియు వేదింపుల ఆరోపణలు వచ్చిన చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కచ్చితంగా మారుస్తారననే అంచనాలకు భిన్నంగా 90 శాతానికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలనే కొనసాగిస్తూ లిస్ట్ రిలీజ్ చేసిన కేసీఆర్ అభ్యర్థుల గుణగణాలు కన్నా తాము చేసిన అభివృద్ద్దే పెద్ద పాత్ర పోషిస్తుంది అన్న అంచనాలతో ఉన్నట్లుగా తెలుస్తుంది .వివాదాస్పద కేసులలో ఇరుక్కున్న కొంతమంది ఎమ్మెల్యేలను మాత్రం తప్పించిన కేసీఆర్ మరి కొంతమంది విషయం లో పెద్ద మనసు చేసుకోవడం వెనుక అనేక సమీకరణాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది .

సర్పంచ్ నవ్య కేసులో అపఖ్యాతి పాలైన మాజీ ఉప ముఖ్య మంత్రి రాజయ్య( T Rajaiah ) ను తప్పించిన కేసీఆర్, కొడుకు ప్రవర్తన వల్ల అపఖ్యాతి పాలైన వనమా వెంకటేశ్వరరావు( Vanama Venkateswara Rao )ను కొనసాగించడం గమనార్హం .అభ్యర్థులు ఎంపికలో సామాజిక సమీకరణాలను ,ఆర్థిక అండదండలను లెక్కలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది , అంతేకాకుండా ఆఖరి నిమిషం వరకు సీట్ల విషయాన్నీ నాన్చి అనవసరమైన వివాదాలకు, గోడ దూకే చర్యలకు నేతలు పాల్పడకుండా అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దూసుకు వెళ్లే విధంగా కేసీఆర్ ముందడుగు వేశారు.ఒకటి రెండు రోజుల్లో తిరుగుబాటు అభ్యర్థుల బుజ్జగింపులు పర్వాలను పూర్తి చేసుకొని సాధ్యమైనంత వేగంగా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లాలనే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నట్లుగా తెలుస్తుంది.ఆఖరి నిమిషం వరకూ గుప్పెట మూసి ఉంచడం అనవసరమని తాడోపేడో ఇప్పుడే తేల్చే సుకుంటే ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్ళొచ్చన్న లక్ష్యంతోనే అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినట్లుగా తెలుస్తుంది.
దానితో సీట్ల దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాము ఆకర్షించాలని భావించిన ప్రతిపక్షాల ఆశలపై కేసీఆర్ భారీ దెబ్బ కొట్టినట్లు అయింది.ప్రభుత్వo చేసిన అభివృద్ధి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో గీటు రాయిగా ఉంటాయని భావిస్తున్న కేసీఆర్ మరోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నామన్న దీమాను ప్రదర్శించడం గమనార్హం .