ఐపీఎల్ లో( IPL ) ఇప్పటికే చాలా టీంలు భారీ కసరత్తులను చేస్తూ వాళ్ల సత్తా చాటుతూ వరుస విజయాలను అందుకునే ప్రాసెస్ లో ముందుకు దూసుకెళ్తున్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) ఆడిన మొదటి మ్యాచ్ లోనే భారీ విక్టరీని సాధించి ఈ ఐపీఎల్ సీజన్ ని ఘనంగా ప్రారంభించింది.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తో( Gujarat Titans ) తన రెండో మ్యాచ్ ని ఆడబోతుంది.ఇక అందులో భాగంగానే ఎవరు పై చేయి సాధించబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మారబోతుంది ఎందుకంటే ఈ రెండు టీమ్ లు కూడా ఐపీఎల్ సీజన్ 16 లో ఫైనలిస్టులుగా మారడమే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టీం కి భారీ జలక్ ఇచ్చి మరి విజయాన్ని సాధించింది.

ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే తనను తాను గెలిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా గుజరాత్ టీం చెన్నై మీద భారీ రివెంజ్ తీర్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఇలాంటి క్రమంలో గుజరాత్ టీం భారీ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ని ఆడానికి రెడీ అవుతుంది.ఇక గిల్( Gill ) సారథ్యం లో అడుతున్న గుజరాత్ మొదటి మ్యాచ్ లోనే ముంబై టీమ్ ను చిత్తు చేసి మరి భారీ విజయాన్ని అందుకుంది.ఇక ఇది ఇలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టీమ్ ను ఎదుర్కోగలుగుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక చెన్నై టీం కూడా మరీ తేలికైన టీమ్ అయితే కాదు.ఆ టీంలో మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు.

మొదటి మ్యాచ్ ను కనుక మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తనదైన రీతిలో సూపర్ డూపర్ మ్యాచ్ లను ఆడుతూ భారీ విక్టరీని సాధించారు.ఇక ఇప్పటికే ముస్తిఫిజర్ రహమాన్( Mustafizur Rahman ) అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు.మరి మతిషా పతిరాన టీంలోకి వస్తే ముస్తి ఫీజర్ రహమాన్ ని కూడా టీంలో కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే డారెలు మిచెల్ ను పక్కన పెట్టి మతిషా పథిరాన,( Matheesha Pathirana ) ముస్తి ఫిజర్ రహమాన్ కూడా ఆయన ప్లేసులో టీంలోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఏం జరగబోతుంది అనేది…
.