కరోనా పుణ్యమాని నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.ముఖ్యంగా ఆయిల్ ధరలు ఏవిధంగా సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయో వేరే ప్రస్తావించాల్సిన పనిలేదు.
ఇంచుమించుగా ఆయిల్ కోసమే ఓ సగటు కూలి తన నెల సంపాదనలో 40% ఖర్చు చేస్తున్నాడని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.దీన్ని బట్టి అర్ధం చేసుకోండి, ఆయిల్ ధరలు ఏ విధంగా మంట పెడుతున్నాయో.
ఇకపోతే తాజా సమాచారం ప్రకారం, ఇండోనేషియా దేశం పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.వంట నూనెల ధరలు పెరిగిపోయిన దశలో ఈ నిర్ణయం భారత్‌కు ఊరట కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు.
పామాయిల్ కు ప్రపంచంలోనే అతిపెద్ద సరఫరాదారు ఇండోనేషియా. గత ఏప్రిల్ నెల 28వ తేదీ నుంచి ఆ దేశం పామాయిల్ ఎగుమతులను నిలిపివేయడం అంతర్జాతీయంగా పలురకాల ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
తమ దేశంలో పామాయిల్ సప్లయ్ పెరగడానికి ఈ నిర్ణయం తీసుకుంది.అయితే ఇండోనేషియా రైతులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.అక్కడ పామాయిల్ పరిశ్రమపై కోటి 70 లక్షల మంది వర్కర్లు ఆధారపడి జీవిస్తున్నారు.దీంతో తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది ఇండోనేషియా.
నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.ఈ నెల 23నుంచి ఎగుమతులు తిరిగి ప్రారంభం అవుతాయి.
ప్రతి ఏటా భారత దేశం ఇండోనేషియా నుంచి 3 లక్షల టన్నుల పైగా పామాయిల్ దిగుమతి చేసుకునేది.అక్కడి నుంచి సరఫరా ఆగిపోవడంతో ఇపుడు మలేసియా, థాయ్‌లాండ్‌లపై ఎక్కువగా ఆధారపడవలసి పరిస్థితి.ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత్‌కు సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరా కూడా తగ్గడంతో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది.దీంతో ధరలు ఒక్కసారిగా వంట నూనెల ధరలు పెరిగిపోయాయి.ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను తిరిగి ప్రారంభించడంతో వంట నూనెల ధరలు తిరిగి అదుపులోకి వస్తాయని అందరూ భావిస్తున్నారు.