ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ మన బ్రహ్మీ అని మీకు తెలుసా?

ఈ మధ్య హీరోల రెమ్యునరేషన్స్ చూస్తుంటే మన టాలీవుడ్ హీరోలేనా ఇంత పుచ్చుకుంటున్నారు అని అనిపిస్తుంది.హీరో, హీరోయిన్ల కంటే మిగిలిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ చాలా తక్కువ అని అంటుంటారు.

 India's Richest Comedian Brahmanandam Net Worth, Brahmanandam, Tollywood, Social-TeluguStop.com

కానీ మన టాలీవుడ్ లో లెజెండరీ కమెడియన్ మాత్రం స్టార్ హీరోలను మించిన సంపాదన ఉందని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం ( Brahmanandam ) అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.

అంతగా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.అయన సినిమాలు చూస్తే ఎంత బాధలో ఉన్నా వారు అయినా కూడా అయన కామెడీ చూస్తు ఆ కాసేపు అన్నీ టెన్షన్స్ మరిచిపోయి హాయిగా సినిమాని ఎంజాయ్ చేస్తాం.

అయితే ఈయనను చాలా రోజుల నుండి ఆడియెన్స్ మిస్ అవుతున్నారు.

Telugu Brahmanandam, Brahmanandamnet, Indias Richest, Indiasrichest, Tollywood-M

గత కొంత కాలంగా తెలుగు ప్రేక్షకులు ఆయన కామెడీని మిస్ అవుతున్నారు.బ్రహ్మానందంకు ఆరోగ్యం సరిగ్గా లేక పోవడంతో కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.ఇక ఈ మధ్యనే కొన్ని సినిమాలో కనిపించారు.

ఇప్పుడు మరి కొన్ని సినిమాలో కనిపించేందుకు రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉండగా తాజాగా బ్రహ్మానందం ఆస్తుల ( Brahmanandam Net Worth ) గురించి న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ గా బ్రహ్మానందం ఉన్నాడని తెలియడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.అవును ఈయన తన సంపాదనతో చాలా మంది స్టార్ హీరోలను కూడా అధిగమించారు.

ప్రస్తుతం ఈయన వయసు 67 సంవత్సరాలు.అయినా ఈయన యాక్టివ్ గా ఉంటూ సినిమాలు చేస్తున్నాడు.

వెయ్యికి పైగానే సినిమాల్లో నటించిన బ్రహ్మానందం సినిమాకు 1 నుండి 2 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Telugu Brahmanandam, Brahmanandamnet, Indias Richest, Indiasrichest, Tollywood-M

ఇంతకు ముందు రోజుకు రెండు నుండి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే వారట.ఇక ఇప్పుడు ఈయన నెట్ వర్త్ 490 కోట్లు అని తెలుస్తుంది.కపిల్ శర్మ కంటే కూడా బ్రహ్మి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

ఈయన వద్ద ఖరీదైన కార్ల కలెక్షన్స్ కూడా ఉన్నాయి.హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఇల్లు, పలు చోట్ల బంగ్లాలు, వ్యవసాయ పొలాలు వంటివి చాలానే కూడబెట్టినట్టు తెలుస్తుంది.

ఇలా ఇండియాలోనే రిచెస్ట్ కమెడియన్ అంటే మన బ్రహ్మానందం అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube