త్వరలోనే మెగా కుటుంబంలో పెళ్లి భాజలు మోగబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) లా నిశ్చితార్థపు వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఇక ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా మెగా అల్లు కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరి ఎంతో ఘనంగా ఈ వివాహ వేడుకలను ప్రారంభించారని తెలుస్తోంది.ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైనప్పటికీ వీరి వివాహం ఎక్కడ ఏంటి అనే విషయాలను మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇక వరుణ్ తేజ్ గతంలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ తన వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ అని చాలా సింపుల్గా కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగబోతుందని వెల్లడించారు.మరి వీరి వివాహం ఎక్కడ ఏంటి అనే విషయాలను తెలియచేయలేదు కానీ తాజాగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సందర్భంగా వీరి వివాహ వేదిక ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.వీరిద్దరూ తమ వివాహాన్ని ఇటలీ( Italy ) లోని టుస్కానీ( Tuscany ) నగరంలో జరగబోతుందని తెలుస్తోంది.ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన( Upasana ) సోషల్ మీడియా వేదికగా ప్రీ వెడ్డింగ్ ఫోటోలను షేర్ చేస్తూ తెలియజేశారు.

ఇలా వీరి వివాహం ఇటలీలో జరగబోతుందని క్లారిటీ వచ్చినప్పటికీ పెళ్లి ఎప్పుడు అనే విషయం గురించి ఇంకా ప్రకటన తెలియజేయలేదు.బహుశా అక్టోబర్ చివరి వారంలోనూ లేదా నవంబర్ మొదటి వారంలోనూ వీరి వివాహం ఉండవచ్చని భావిస్తున్నారు.ఇకపోతే ఇప్పటికే పెళ్లి పనులు అన్నీ కూడా ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.ఇక వరుణ్ తేజ్ లావణ్య ఇద్దరు కూడా మిస్టర్ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు అయితే ఇటలీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరి మధ్య ఉన్న ప్రేమ విషయం బయటపడటంతో అక్కడే తమ వివాహం చేసుకోవాలని ఈ జంట భావించినట్టు తెలుస్తోంది.







