అమెరికాలో చోటుచేసుకున్న ఓ భారీ కుంభకోణం సంచలనం సృష్టిస్తోంది.మిలియన్ డాలర్ల ఈ భారీ ఆక్రమంలో ముగ్గురు ఇండో అమెరికన్స్ పాత్ర అత్యంత కీలకంగా ఉందని.
అమెరికా న్యాయ విభాగం తెలిపింది.కోట్లాది రూపాయల నగదు అక్రమ చలామణీ లో ఈ ముగ్గురు భాగస్వాములు గా ఉన్నారని కోర్టు నిర్ధారించింది.
ఈ మేరకు దాదాపు ఐదు వారాల పాటు జరిగిన విచారణలో టెక్సాస్ లోని లారెడోకి చెందిన గుడిపాటి రవీందర్‌రెడ్డి …హర్ష్ జగ్గీ ….నీరు జగ్గీ లని దోషులుగా వెల్లడించింది కోర్టు.వీరితోపాటు మరో ముగ్గురు అమెరికా పౌరులు కూడా ఆ కుంభకోణంలో ఉన్నారని వారిపై నేర ఆరోపణలు కూడా రుజువు అయ్యాయని న్యాయ శాఖ క్రిమినల్ అటార్నీ జనరల్ బ్రియాన్ బెంక్జోస్కీ తెలిపారు.
అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులు 2011-2013 మధ్య అమెరికా వ్యాప్తంగా మాదకద్రవ్యాల విక్రయం ద్వారా వచ్చిన మిలియన్ డాలర్ల సొమ్మును టెక్సాస్‌లోని లారెడోకి చేరవేశారని, అనంతరం ఆ నగదు గుడిపాటి రవీందర్ రెడ్డి…హర్ష్ జగ్గీ….నీరు జగ్గీలకు చెందిన ఓ దుకాణాలకు చేరిందని కొంతమంది సాక్ష్యులని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు.