అమెరికా వ్యాప్తంగా అత్యంత సంచలనం సృష్టించిన భారతీయ విద్యార్ధుల అక్రమ కేసు విషయం పై ఇప్పుడు అమెరికా కోర్టులో వాదనలు వినిపిస్తున్నాయి.ఫర్మింగ్టన్ నకిలీ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన విద్యార్ధులు అందరూ మేము భారత్ నుంచీ వచ్చామని , ఎలాంటి తప్పులు చేయలేదని మిచిగాన్ లోని ఫెడరల్ కోర్టులో వాదించారు.
అయితే ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఒకరైన ఫణిదీప్ కర్నాటిని , పదివేల డాలర్ల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.మిగిలిన వారు ఖరత్ కాకిరెడ్డి, సురేష్ కందాల, ప్రేమ్ రామ్పీస, సంతోష్ సమ, అవినీష్ తక్కెళపల్లి, అశ్వత్ నునె, నవీన్ ప్రతిపాటి, లను మిచిగాన్ తూర్పు జిల్లాకు చెందిన జడ్జి ఎదుట హాజరు పరిచారు.వీరందరినీ ఇమ్మిగ్రేషన్ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన విషయం విధితమే.
ఈ విద్యార్ధి వీసా స్కాము ఆధారంగా అరెస్ట్ చేసిన వారిలో ఉన్న 130 మంది లో ఒకరు మాత్రమె వేరే దేశానికి చెందినా వారని మిగిలిన 129 మంది భారతీయులోనని పేర్కొన్నారు.సోమవారం వారిని కోర్టులో హాజరు పరుచాగా తాము ఏ తప్పు చేయలేదని కోర్టుకు విన్నవించుకున్నారని వారి తరుపు న్యాయవాది తెలిపారు.